మెగా హీరో రాంచరణ్ తన అసలైన రచ్చ ఎలా ఉంటుందో రుచి చూపించాడు. సంక్రాంతి బరిలో ఉన్న ఎవడు కొత్త టీజర్‌ని రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసుకున్నాడు. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా రావాలన్న రీతిలో రాంచరణ్ తన జోరు చూపించి, మెగా అభిమానుల్ని ఖుషీ చేశాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎవడు విడుదలకు సిద్ధమౌతోంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, శృతిహాసన్, అమీజాక్సన్ జంటగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు ఎవడు చిత్రాన్ని నిర్మించాడు. ఎవడు చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలౌతోంది. కానీ, నిజానికి ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సిన ఉంది. పలు మార్లు వాయిదా పడడంతో ఎవడు చిత్రంపై ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఒకే ఒక్క టీజర్‌ని విడుదల చేసి రాంచరణ్ ఆ అనుమానాల్ని పటాపంచలు చేసేశాడు. న్యూ ఇయర్ కానుకగా నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన ఈ స్పెషల్ టీజర్‌కు మెగా రెస్పాన్స్ ‌లభించింది. రాంచరణ్ నుండి మెగా అభిమానులు ఏ అంశాన్నైతే ఆశిస్తున్నారో టీజర్‌లో అది కనిపించడంతో ఫ్యాన్స్ ‌ఖుషీ ఔతున్నారు. ఈ కొత్త టీజర్‌తో ఎవడు చిత్రంపై అంచనాలు ఊపందుకోగా థియెట్రికల్ ట్రైలర్‌ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే, సెంటిమెంట్ పరంగా సైతం ఎవడు అందర్ని ఆకట్టుకుంటోంది. గత సంక్రాంతికి విడుదల చేసిన నాయక్ సూపర్ డూపర్ హిట్టవ్వడం, దీనికి తోడు సంఖ్యా పరంగా అగ్రహీరోల ఏడో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనే సెంటిమెంట్ ఉంది. దీంతో ఎవడు చిత్రం కచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమని ఎవడు యూనిట్ ధీమాతో ఉంది. మొత్తానికి, ఎవడు లేట్‌గా వస్తున్నప్పటికీ లేటెస్ట్‌గా ఉందనే టాక్‌ని సొంతం చేసుకుంటోంది. రిలీజ్ డేట్ వరకు ఇదే పంథాని కొనసాగించి రాంచరణ్ అసలు సిసలైన తుఫాన్‌ని సృష్టిస్తాడని మెగా అభిమానులు ధీమాతో ఉన్నారు. సో, మెగా హీరోకి ఈ కొత్త సంవత్సరం కలిసి రావాలని టాలీవుడ్ ఆశిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: