కొత్త సంవత్సరం అడుగు పెట్టి రెండు రోజులు అయిందో లేదో టాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ ల పరంపర మొదలైంది. ఈ కొత్త సంవత్సరం నందమూరి కుటుంబానికి చాల ముఖ్యమైన సంవత్సరం. రాజకీయ పరంగా, సినిమాల పరంగా ఈ సంవత్సరం అటు బాలకృష్ణకు, ఇటు జూనియర్ కుకూడా ముఖ్యమైన సంవత్సరంగా మారింది.  ప్రస్తుతం జూనియర్ బాలయ్యల క్రేజ్ టాలీవుడ్ లో అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ సంవత్సరం విడుదల కాబోతున్న వారి సినిమాలు వారి కేరియర్ కు సబంధించి అత్యంత ప్రతిస్టాత్మకంగా మారాయి. ఈ నేపధ్యంలో జూనియర్ బాలయ్యల మధ్య బేధాభిప్రాయాలు నందమూరి అభిమానులను రెండు వర్గాలుగా విడగొట్టే పరిస్థుతులు ఏర్పడాయి అన్నది నిజం. ఈ పరిస్థుతులలో రాజకీయంగా ఎలా ఉన్న సినిమాల పరంగా ఈ వ్యవహారానికి చెక్ పెట్టడానికి వీరిరువురు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ఇందులో భాగంగానే నందమూరి నట సింహం బాలయ్య సినిమాలో యువ సింహం ఎన్టీఆర్ చేత ఓ గెస్ట్ రోల్ కు రంగం సిద్దం చేసినట్లు ఫిలిం నగర్ టాక్. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన లెజెండ్ సినిమాలో ఒక చిన్న పాత్ర చెయ్యటానికి మంచి క్రేజ్ ఉన్న హీరో కావాల్సి ఉండడంతో దర్శకుడు బోయపాటి ఎన్టీఆర్ అయితే బాగుటుందని బాలయ్యతో వివరించాడట.బాలకృష్ణ కూడా ఈ సూచనకు ఓకే చెప్పడంతో ప్రస్తుతం బోయపాటి తారక్ ను ఒప్పించే పనిలో ఉన్నాడట. తారక్ కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయని, ఈ చిత్రంతో నందమూరి కుటుంబం అంత ఒకటే అనే భావన కూడా ప్రేక్షకులలో వెళ్తుందని తారక్ భావిస్తున్నాడని టాక్.  ఈ వార్తలే నిజం అయితే ఎప్పటి నుంచో బలయ్యా, జూనియర్లను ఒకే సినిమాలో చూడాలి అని కలలు కంటున్న నందమూరి అభిమానుల చిరకాల కోరిక తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: