కర్ణాటక మెగా ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షడు, దివంగత కోటె వెంకటేష్ యాదవ్ సంతాప సభ శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని టౌన్ హాలులో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు, అల్లు అరవింద్ కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువజన శాఖ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు ఆర్వీ దేవరాజ్, జమీర్ అహమ్మద్ హాజరు కానున్నారు.  గత ఏడాది అక్టోబరు 29న తన సోదరి అనితతో కలిసి జబ్బర్ ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు ప్రమాదంలో కోటె వెంకటేష్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇటీవల వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి చిరంజీవి సోదరుడు నాగబాబు రూ.5 లక్షలు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: