కొలరవెరి డి ధనుష్ గుర్తున్నాడు కద.. తను లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో రాంజానా సినిమాతో సూపర్ హిట్ కొట్టి సౌత్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు తన రెండో బాలీవుడ్ సినిమా బాల్కి డైరక్షన్లో చేస్తున్నాడు. ‘పా’ సినిమాతో ఫేమస్ అయిన బాల్కి డిఫరెంట్ సినిమాలను తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ కూడా ఒక క్యారక్టర్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో ధనుష్ మూగవాడిగా నటిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. రెండో సినిమానే ప్రయోగం చేస్తున్న ధనుష్ ని చూసి బాలీవుడ్ హీరోలు కొంచం అలర్ట్ అవుతున్నారట. ఈ సినిమాతో కమల్ రెండో కూతురు అక్షరా హాసన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమవుతుంది. సో ఇన్ని హంగులతో తీర్చిదిద్దితున్న ఈ సినిమా ధనుష్ బాలీవుడ్ కెరియర్ ని ఇంకొంచం ముద్దుకు నడిపిస్తుందో.. ప్రయోగాలు చేస్తున్న సౌత్ హీరో కి పట్టం కడుతుందో లేదో తెలియాల్సి ఉంది. రాంజానా సినిమా చూసి తన నటనకు ఫిదా అయిన అమితాబ్ ధనుష్ ని పిలిచి మరి అబినందించాడన్న విషయం మనకు తెలిసిందే.. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తుండడంతో బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తారు. ఈ సినిమాకు పీ.సీ శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. చివరగా కోలీవుడ్ ఆడియెన్స్ ని మార్యన్ సినిమాతో అలరించిన ధనుష్ ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: