హీరో శివాజీ పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల కోసం బాసటగా నిలిచి అందోళన చేస్తున్న బాదితులకు మద్దతుగా నిలిచాడు. ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన బాధితులకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఈ నెల 15 లోగా ప్రభుత్వం స్పందించకుంటే 16వ తేదీన ఆమరణ దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి హెచ్చరిక చేసాడు శివాజీ.  రాష్ట్రంలో వేలాది ప్రైవేటు బస్సులు సరైన భద్రత నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నాయని, అలాంటి బస్సులను కట్టడి చేయలేని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అభిప్రాయ పడ్డాడు. అంతేకాదు ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే అని శివాజీ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే రూ. లక్ష రూపాయల పరిహారంతో బాధితుల కుటుంబాలు ఎన్నాళ్లు జీవిస్తారు ఆయన ప్రశ్నవేసాడు. అంతేకాదు రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్ల కోసమే పని చేస్తున్నాయి కాని, ప్రజల సమస్యలు గురించి పట్టించుకోవడం లేదని అంటూ ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఎందుకు అంటు నాయకుల పై విమర్శలు కురిపించాడు శివాజీ.  సామాన్య ప్రజలకు లేని బద్రత రాజకీయ నాయకులకు కోట్లాది రూపాయల ఖర్చుతో ఎందుకు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తాను పాలెం బాధితులందరికీ వ్యక్తిగతంగా సహాయం చేయలేకపోయినా వారి తరఫున పోరాడుతూ వారికి సరైన న్యాయం జరిగే వరకు పోరాడుతానని అవసరం అనుకుంటే తాను ఈ బాధితుల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్దమని శివాజీ ప్రకటించాడు రాబోతున్న ఎన్నికల గురించి, ఏ పార్టీలో చేరితే గెలుపు గుర్రం అవుతుందో అనే ఆలోచనలలో,తెలియని అయోమయ స్థితిలో రోజులు గడుపుతున్న మన నాయకులకు శివాజీ మాటలు ఎంతవరకు వినపడతాయి అన్నదే ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: