మెగా పొలిటికల్ స్టార్ చిరంజీచి ఫై చార్మీ సటైర్లు వేసింది అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది జరిగింది. ప్రస్తుతం చార్మీ ప్రతిఘటన అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అమెది జర్నలిస్ట్ పాత్ర. గతం లోకమ్యునిస్టు సినిమాలను నిర్మిoచిన తమ్మారెడ్డి భరద్యాజ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ సినిమాలో నటిస్తున్న రఘుబాబు పాత్ర చిరంజీవి రాజకీయ జీవితాన్ని పోలి ఉంటుందట. రాజకీయ నేపధ్యంలో నడిచే ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న చార్మీ చిరంజీవి రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చార్మీ విసిరిన సటైర్లు ఉంటాయని టాలీవుడ్ టాక్  చిరంజీవికి ఈ సినిమాకు దర్శక త్యం వహిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజకు వైరుధ్యాలు ఉన్న నేపధ్యంలో చార్మీ వదలబోతున్న సటైర్ లు ఘాటుగానే ఉంటాయని ఫిలిం నగర్ టాక్. ఒక వాస్తవ కధ ఆధారంగా నిర్మింప పడుతున్న ఈసినిమా ఈనెలలో రిపబ్లిక్ డే రోజున విడుదల కాబోతోంది  మరి ఛార్మి వేసే సెటైర్ల ఫై మెగా అభిమానులు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి. విజయాలు లేక వెనక పడిపోయిన ఛార్మీకి ఈసినిమా అయినా కలిసి వస్తుందా అనేది సస్పెన్సు. . 

మరింత సమాచారం తెలుసుకోండి: