యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ ర‌భ‌స మూవీ షూటింగ్‌లో బిజిబిజిగా ఉన్నాడు. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు డెబ్బైశాతం వ‌ర‌కూ పూర్తిచేసుకుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత హీరోయిన్‌గా చేస్తుంది. స‌మంత‌కు సంబంధించిన కొన్ని కీల‌క సీన్స్ త‌ప్పితే మిగ‌తా టాకీ పార్ట్ అంతా పూర్తిచేసుకుంది. ఇదిలా ఉంటే ర‌భ‌స మూవీ త‌రువాత ఎన్టీఆర్ చేయ‌బోతున్న మూవీ విశేషాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ర‌భ‌స మూవీ త‌రువాత క్రేజీ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ మూవీను చేయ‌టానికి రెడీగా ఉన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సుకుమార్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ మూవీకు యంగ్‌స్టార్ అనే టైటిల్‌ను ఖ‌న్‌ఫ‌ర్మ్ చేశారు. యంగ్‌స్టార్ టైటిల‌న్‌ను సుకుమార్ రిజిస్టర్ చేశాడ‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంటుంది. ఎన్టీఆర్‌కు యంగ్‌స్టార్ అనే టైటిల్ క‌రెక్ట్‌గా ఉంటుంద‌ని సుకుమార్ చెబుతున్నాడు. సుకుమార్‌, ఎన్టీఆర్ మూవీను బివియ‌స్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. బివియ‌స్ఎన్ ప్రసాద్ ఇప్పటికే అత్తారింటికిదారేది మూవీను నిర్మించి లాభాలను ఆర్జించాడు. మొత్తంగా ఎన్టీఆర్ ర‌భ‌స మూవీ త‌రువాత సుకుమార్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ ప్రస్తుతం వ‌న్ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: