ఈ మధ్య 100 రోజులు సినిమాలు అసలు రావట్లేదనే చెప్పాలి.. మనవాళ్లు ఎంతసేపటికి వారం కలెక్షన్లు, రెండు వారాల కలెక్షన్లు.. ఫారిన్ కలెక్షన్స్ అని లెక్కలేసుకుంటున్నారు తప్పించి అసలు 100 రోజులు ఆడే సినిమాను తీయడం మర్చిపోయారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు సౌత్ సినిమాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాయి.. వాటిలో ..పవర్ స్టార్ పవర్ పాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ మోస్ట్ ఎంటర్ టైనింగ్ గా తీసిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసింది. సెప్టెంబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణతో సూపర్ హిట్ అయ్యి రీసెంట్ గా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. పవర్ స్టార్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ అందరు పండగ చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు సినిమా పైరేటెడ్ అయినా సరే ఫ్యాన్స్ ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే రాజా రాణి విషయానికొస్తే ఆర్య, నయన తార హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అట్లీ కుమార్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా కూడా కోలివుడ్ లో సూపర్ హిట్ అయ్యి రీసెంట్ గా వంద రోజులు కంప్లీట్ చేసుకుంది. సినిమా రిలీజ్ కి ముందు ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేని ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునుండే సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక్కడ అత్తారింటికి దారేసి త్రివిక్రం దర్శకత్వం లో రికార్డ్స్ సృష్టించి కెవ్వు కేక అనిపించుకుంది. అక్కడ రాజా రాణి సినిమా సూపర్ హిట్ అయ్యింది. చాలా కాలం తర్వాత సినిమా 100 డేస్ ఆడిన సినిమాలుగా ఈ రెండిటిని చెప్పొచ్చు. కేవలం 100 రోజులు ఆడటమే కాకుండా భారి కలెక్షన్స్ రాబట్టి సెన్షేషన్ ని క్రియేట్ చేశాయి ఈ సినిమాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: