పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బీవీయస్ ఎస్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి తెలుగు సినిమా చరిత్రను తిరగ రాస్తూ కలెక్షన్స్ తుఫానును సృష్టించిన సినిమా 32 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నిర్మాతలు ‘100 సంవత్సరాల చరిత్ర - 100 రోజుల వేడుక ’ పేరుతో వాల్ పోస్టర్ ని విడుదల చేశారు . ఈ సినిమా మొదటి ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకుని ఈ చిత్రం దేశ, విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా కలెక్షన్ల గురించి కానీ, ఎంత వసూలు చేసిందనేదనే మాట కాని ప్రస్తావించకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  టాలీవుడ్ లో తొలిసారి వంద కోట్ల కబ్బులోకి వెళుతుందని ఆశ పడ్డ ఈ సినిమా కలెక్షన్స్ గురించి సినిమా యూనిట్ సభ్యులు ఇప్పుడు ఒక్క మాట కూడ మాట్లాడక పోవడం మరొక ఆశ్చర్యకరమైన విషయం. ఈ సమావేశంలో కొంతమంది పత్రికా ప్రతినిధులు మాత్రo వందకోట్ల మాటేమిటి అని ప్రశ్నిస్తే సమాధానం మౌనమే అయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా మగధీర కలెక్షన్లను డామినేట్ చేసినా మొత్తంగా 85 కోట్లు మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాల టాక్.  దీనిని బట్టీ పవన్ ‘అత్తారిల్లు’ వంద కోట్ల కల పగటి కలే అయిందని అనుకోవాలి. మరి ఈ కొత్త సంవత్సరంలో మన టాలీవుడ్ సినిమాను వంద కోట్ల దరికి తీసుకు వెళ్ళే హీరో ఎవ్వరో రానున్న కాలమే తేల్చాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: