రామ్‌చ‌ర‌ణ్ 2014లో కొత్త నిర్ణయాల‌ను తీసుకొని టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీను అవాక్కు చేస్తున్నాడు. 2013వ సంవ‌త్సరంలో దాదాపు చ‌ర‌ణ్‌కు అన్ని విధానాల న‌ష్టమే చేకూరింది. ఒక్క నాయ‌క్ మూవీ స‌క్సెస్ త‌ప్పితే, మిగ‌తావి అన్ని రామ్‌చ‌ర‌ణ్‌కు అంత‌గా క‌లిసిరాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే చ‌ర‌ణ్ ప్రెస్టేజియ్ ఫిల్మ్ జంజీర్ సైతం, ఘోర డిజాస్టర్‌ను చూడ‌టంతో చ‌ర‌ణ్ మీద నెగిటివ్ జోరందుకుంది. అలాగే సాప్ట్‌వేర్ ఉద్యోగుల‌తో గొడ‌వ‌కు దిగి అంద‌రి మ‌ధ్య దోషిగా నిల‌బ‌డినంత ప‌నైంది. ఇలా వ‌రుసగా రామ్‌చ‌ర‌ణ్‌కు 2013వ సంవత్సరం చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. ఇదిలా ఉంటే ఈ సంవ‌త్సరంలో రామ్‌చ‌ర‌ణ్ లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా ప‌బ్లిక్ ఫంక్షన్స్‌కు వ‌చ్చిన‌ప్పుడు దురుసుగా మాట్లాడ‌కుండా, త‌న తండ్రి చిరంజీవి ఏవిధంగా మాట్లాడ‌తాడో, అదే సున్నిత‌మైన స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు. ఒక‌ప్పుడు మీడియా మీద దురుసుగా మాట్లాడిన చ‌ర‌ణ్‌, ఇప్పుడు మీడియానూ అంత ఫోక‌స్ చేయ‌టం లేదు. ఫైన‌ల్‌గా చెప్పాలంటే రామ్‌చ‌ర‌ణ్ ఇక నుండి మీడియాతో ఎటువంటి గొడ‌వ‌లు పెట్టుకోకూడ‌ద‌ని, చిన్న విష‌యాల‌కు రాద్ధాంతం చేయ‌కూడ‌ద‌ని వంటి నిర్ణాయాల‌ను తీసుకున్నాడు. రీసెంట్‌గా ప్రెసెమీట్‌కు వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్‌ను రెచ్చగొట్టే ప్రయ‌త్నంగా మీడియా ఓ క‌థ‌నానికి సంబంధించిన న్యూస్‌పై క్లారిటి అడిగింది. అయితే ఆ క‌థ‌నానికి స్పందించిన రామ్‌చ‌ర‌ణ్‌, 'మీరు రాసిన స్టోరీకు నా చిరున‌వ్వే స‌మాధానం' అంటూ పూర్తిచేశాడంట‌. రామ్‌చ‌ర‌ణ్ త‌న ఆవేశాన్ని ఇంత‌లా త‌గ్గించుకునే నిర్ణయం మీడియాను షాక్ చేస్తుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: