ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే యంగ్ హీరో నితిన్‌కు వ‌ల్లమాలిన అభిమానం, అంత‌కు మించిన ప్రేమ‌. త‌న‌కు వ‌రుస పెట్టి ప్లాపులు వ‌స్తున్నప్పటికి, సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్నింగ్ కావ‌డానికి కార‌ణం ప‌వ‌న్‌క‌ళ్యాన్ ఆశీస్సులే అని నితిన్ అంటాడు. అందుకే ఇష్క్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకువ‌చ్చి, వీరిద్దరి మ‌ధ్య స్నేహ బంధం ఏవిధ‌మైన‌దో అంద‌రికి చూపించాడు. అలాగే ప‌వ‌న్ మీద ఉన్న పిచ్ఛి ప్రేమ‌తోనే అత్తారింటికిదారేది మూవీ నైజాం రైట్స్‌ను అంద‌రి కంటే ఎక్కువుగా కొనుక్కున్నాడు. అయితే మూవీ లాభాల బాట ప‌ట్టి, నితిన్ కొన్నదానికి న‌ల‌భై శాతం లాభాల‌ను తెచ్చి పెట్టింది. ఈ విధంగా వీరిధ్ధరి బంధం బ‌ల‌మైన‌ద‌ని అంటారు. అయితే రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యక్తిగ‌త జీవితం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ కావ‌డంతో, ప‌వ‌న్ ఎటువంటి ఆడియో ఫంక్షన్స్‌కు వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. నితిన్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ హార్ట్ఎటాక్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు ప‌వ‌న్ రావ‌ల్సి ఉండ‌గా, చివ‌రి నిముషంలో కాన్సిల్ అయ్యింది. చేసేదేమి లేక‌, హార్ట్ఎటాక్ మూవీను వైవిధ్యంగా ప్రమోట్ చేయాలంటే దానిని బ్యాంకాక్‌లో ఆడియో లాంచ్ చేయ‌ట‌మే క‌రెక్ట్ అని భావించి ఆ విధంగా జ‌రిపించారు. అలాగే నితిన్ అప్‌క‌మింగ్ మూవీల‌కు సైతం ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం క‌ష్టమే అని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏ పేరును నితిన్ ఉప‌యోగించుకున్నాడు, ఇక ఆ వ్యక్తి ప‌వ‌న్‌కు దూరం అంటూ టాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: