ప్రస్తుతం నాగార్జున దృష్టి అంతా తాను హీరోగా చేసే సినిమాల కంటే తాను చేస్తున్న వ్యాపారాల పైనే శ్రద్ద ఎక్కువ చుపెడుతున్నాడు. పేద, ధనికులు అన్న విభేదం లేకుండా బుల్లి తెర పై వస్తున్న డైలీ సీరియల్స్ కు మహిళలలో వస్తున్న ఆదరణ అందరికీ తెలిసిన విషయమే.  ఈ విషయంలో కూడ తను ముందడుగు వేస్తూ తాను నిర్మిస్తున్న ‘పుట్టింటి పట్టుచీర', ‘పసుపు కుంకుమ', ‘శశిరేఖా పరిణయం' లాంటి సిరీయల్స్‌కు ప్రచారం కల్పించడంలో భాగంగా నాగార్జున ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సీరియల్స్‌ను ఆదరించాల్సిందిగా బుల్లితెర ప్రేక్షకులను కోరారు.  నాగార్జున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టీవీ సీరియల్ తారలు పల్లవి, యామిని తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే బుల్లితెర పై ఈ సీరియల్స్ వస్తే చాలు టీవిలకు అతుక్కు పోతున్న మహిళలు నాగ్ కు ఈ సీరియల్స్ ద్వారా తమ ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటే ఇంకా ప్రోత్సహించండి అని నాగార్జున అడగడం చూస్తూ ఉంటే భవిష్యత్తులో స్త్రీలు ఇక వంట పని కూడా పూర్తిగా మానివేస్తారని నాగ్ పై సెటైర్లు పడుతున్నాయి.  ఇప్పటికే నాగార్జున సినిమా నిర్మాణ రంగం, సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగం, అన్నపూర్ణ స్టూడియోస్ తరుపున సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు. అంతేకాదు ఇక టీవీ సీరియల్స్ నిర్మాణo పై కూడా సీరియస్ గా ఉన్నాడు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మగవాళ్ళకు కష్టకాలమే అని అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: