మోడీ గ్యాలం లో సూపర్ స్టార్ రజినీకాంత్!! సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ని ఓట్ల రూపంగా మార్చుకుందామని భారతీయ జనతా పార్టీ గ్యాలం వేస్తోంది అంటూ కోలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో తన ఇమేజ్ ని పెంచుకోవడానికి నరేంద్ర మోడీ మంచి వ్యక్తిత్వం ఉండి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తుల కోసం మోడీ తన వేట కొనసాగిస్తున్నాడు.  ఈ క్రమంలో రజినీని తమిళనాడులో భారతీయ జనతా పార్టీ విజయ అవకాసాలను పెంపొందించు కోవడానికి రజినీ క్రేజ్ ను అడ్డంగా పెట్టుకుని ఓట్లు సంపాధించు కోవడానికి తమిళనాడులోని బీజేపీ ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే సూపర్ స్టార్ బీజేపీ గాలంలో పడతారా? లేదా అనే విషయం మాత్రం సస్పెన్స్ అని అంటున్నారు. దీనికోసం రజనీకాంత్‌ను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  తమిళనాడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాచరణ సంఘం సమావేశం శనివారం తిరుచ్చిలో జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మురళిధరరావ్ అధ్యక్షత వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఇల.గణేశన్, తమిళచ్చి సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.  అనంతరం పొన్‌రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నరేంద్రమోడి గాలి వీస్తోంది అని అంటూ రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా తమ పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి అనడం రజినీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాడా అనే సంకేతాలకు ప్రాతిపతికగా కనిపిస్తోంది అంటు కోలీవుడ్ మీడియా రాతలు రాస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: