ప్రముఖ సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సమాచారం విషాదం నింపుతుంది. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.తన స్నేహితులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉదయ్ కిరణ్ చెప్పారని,వారు వచ్చేలోగానే ఆత్మహత్య చేసుకోవడంతో , ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సమాచారాన్ని అందుకున్న సినీ నటులు శ్రీకాంత్, ఆర్యన్ రాజేశ్, తరుణ్, ఇతర సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి వెళ్లారు.ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 తేదిన జన్మించారు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో ఎంగేజ్ మెంట్ జరిగినా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను పెళ్లి చేసుకున్నారు. ఉషాకిరణ్‌మూవీస్‌ బ్యానర్‌లో తేజ దర్శకుడిగా తెరకెక్కించిన 'చిత్రం' సినిమాతో ఉదయ్‌కిరణ్‌ వెండితెరకు పరిచయమయ్యారు. నువ్వునేను, మనసంతా నువ్వే, శ్రీరాం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. 2001లో వచ్చిన 'నువ్వు-నేను' చిత్రానికి ఉత్తమ కథానాయకుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డు దక్కించుకున్నారు. 2012 అక్టోబర్‌ 24న విషితను ఉదయ్‌కిరణ్‌ వివాహం చేసుకున్నారు. ఉదయ్‌కిరణ్‌ 1980 జూన్‌ 26న జన్మించారు. నిర్మల, వీవీకే మూర్తి, ఆయన తల్లిదండ్రులు. సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో కామర్స్‌లో డిగ్రీ చేసారు  చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్‌ రంగంలోకి. 2000లో 'చిత్రం' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం. చిత్రం, నువ్వు-నేను, మనసంతానువ్వే చిత్రాలతో హ్యాట్రిక్‌ హీరోగా పేరు. మొత్తం 19 చిత్రాల్లో ఉదయ్‌కిరణ్‌ నటించారు. అందులో మూడు తమిళ చిత్రాలు. తన తొలి చిత్ర దర్శకుడితో అత్యధికంగా మూడు చిత్రాలు.(చిత్రం, నువ్వు-నేను, ఔనన్నా-కాదన్నా) 2006లో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ దర్శకత్వంలో పోయ్‌(తెలుగులో అబద్ధం) చిత్రంలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: