ఒక హీరోకి నచ్చని కధ మరో హీరోకి నచ్చి సినిమా చేయడం టాలీవుడ్ లో సర్వసాధారణమైన విషయమే. ఆ కధ తమకి నచ్చలేదనో లేదంటే తమ బాడీ లాంగ్వేజ్ కి నప్పలేదనో ఆ సినిమాలను వదులుకుంటు ఉంటారు. తాజాగా నితిన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది అని తెలుస్తోంది. సునీల్ కాదనుకున్న స్క్రిప్టుని నితిన్ స్టోరీ లైన్ విని వెంటనే ఓకే చేసేసాడని వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు నితిన్ స్వయంగా ఈ చిత్రాన్ని తమ బ్యానర్ పై నిర్మించనున్నారని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మహిళా దర్శకురాలు బి.జయ ఆ మధ్యన ఓ స్క్రిప్టుని హీరో సునీల్ కోసం రెడీ చేయించిందట. పూర్తిగా హాస్యం తో పాటు కొద్దిగా యాక్షన్ తో సాగే ఆ స్క్రిప్టుని సునీల్ చేస్తానని ఆమెకు మాట ఇచ్చి నెలలు తరబడి గెంటుకు వస్తున్నాడట.  దీనితో ఈ మధ్య ఆమె నితిన్ ని కలిసి కధ నేరేట్ చేయటం జరిగిందని, దానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం మహిళా దర్శకురాలిగా కొనసాగుతున్న జయ పరాజయాల బాటలో ఉండడంతో ఈమె కధకు నితిన్ ఎలా ఒకే చెప్పాడు అనే ఆసక్తికర మాటలు టాలీవుడ్ లో వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: