తన సినిమాల్లో బూతు కామేడీ పెట్టి ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు మారుతి ప్రస్తుతం కొత్తజంట సినిమా చేస్తున్నాడు. అల్లు శిరీష్ హీరో చేస్తున్న సెకండ్ సినిమాగా రాబోతున్న కొత్త జంట మారుతి మార్క్ కామెడీ టైమింగ్ తో చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ గా తీస్తున్నాడట. తన సినిమాను యూత్ కి చాలా దగ్గరకు తీసుకెళ్లే ట్రిక్ తెలిసిన మారుతి ఈ కొత్తజంట కి కూడా మంచి ప్లాన్ తోనే ఉన్నాడట. ఇక అసలు విషయానికొస్తే మారుతి తన నెక్ష్ట్ సినిమా అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి తీస్తాడా..? ఏంటని.. అందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే స్టైలిష్ స్టార్ గా ఒక సెపరేట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ రెండు అడల్ట్ డోస్ కామెడీ సినిమాలు , ఇంకో రెండు హర్రర్ ఎంటర్ టైన్ సినిమాలు తీసిన మారుతి డైరక్షన్ లో చేస్తాడా అని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ తో తనకు దాదాపు 10 ఇయర్స్ నుండి రిలేషన్ షిప్ ఉందని చాటింపేస్తున్నాడు మారుతి. అంతేకాదు తన అన్ని సినిమాలు బన్నీ మొదటి రోజే చూస్తాడట కూడా.. సరే అంతా బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసేంత ఖలేజా మారుతి కి ఉందా అంటే ఉంది అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. స్టార్ హీరోలలో ఒకడైన విక్టరీ వెంకటేష్ ని రాధ తో డైరక్ట్ చేస్తే ఏం లేదు గానీ..? బన్నీ ని డైరక్ట్ చేయడం పెద్ద విషయమా..? అనేవారు ఉన్నారు. ఏది ఏమైనా బన్నీతో మంచి రిలేషన్ షిప్ ఉందన్న మారుతి తన సినిమాలో తనను నటించమని డైరెక్ట్ గా అడగకుండా ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారు సినీ విమర్శకులు. మారుతి అడిగినా మంచి కథ కాకపోతే బన్నీ మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు లేండి. మొత్తానికి మారుతి చిన్న సినిమాల రేంజ్ నుండి పెద్ద హీరోలను డైరెక్ట్ చేసేంత పెద్ద దర్శకుడయ్యాడని తనని అభినందిస్తున్నారు సన్నిహితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: