2000వ సంవ‌త్సరంలో చిత్రం మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌య‌మైన యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో ఉద‌య్‌కిర‌ణ్‌. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్‌డం స్థానాన్ని పొంది, మేటి హీరోల బాక్సాపీస్‌కు పోటి ఇచ్చిన హీరో కూడ ఉద‌య్‌కిరణే. ముఖ్యంగా ఉద‌య్ కిర‌ణ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అయిన కొత్తలో అమ్మాయిల ఫాలోయింగ్ విప‌రీతంగా ఉండేది. ఎంత‌లా అంటే టాప్ హీరోల‌ను మించిన అభిమానాన్ని టీనేజ్ అమ్మాయిలు ఉద‌య్‌కిర‌ణ్ మీద చూపించేవారు. త‌ను ఏం చేసినా, అది సిల్వర్‌స్క్రీన్‌కు కొత్త త‌ర‌హాగా కనిపిస్తుంది. దీంతో ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద స‌క్సెస్‌ల‌ను చ‌విచూసాయి. ఇదిలా ఉంటే కొన్ని సంవ‌త్సరాల నుండి ఉద‌య్ కిర‌ణ్ మూవీలు ఏవి బాక్సాపీస్‌ను మురింపించ‌లేక‌పోతున్నాయి. అలాగే త‌న వ్యక్తిగ‌త జీవితం కూడ అనుకున్నవిధంగా సాఫిగా వెళ్ళడం లేదు. ఉద‌య్‌కిర‌ణ్‌కు, వాళ్ళ నాన్నగారి మ‌ధ్య ఎప్పటి నుండో ఫైనాన్షియ‌ల్ ప్రాబ్లమ్స్‌కు సంబంధించిన గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉండేవ‌ట‌. ఉద‌య్ కిర‌ణ్ సంపాదించిన ఆస్తుల‌పై వాళ్ళ తండ్రిగారి పెత్తనం ఉండ‌టంతో, ఫైనాన్సియ‌ల్‌గానూ, అలాగే తండ్రితో విభేదాలు ఒక్కోసారి తీవ్రంగా ఉండేవ‌ట‌. త‌ను ఎక్కువుగా ఆలోచించేది తండ్రి చేస్తున్న ప‌నుల గురించే, వాటి నుండి ఎలా బ‌య‌ట ప‌డాలి అనే దానిపైనే ఉంటుంది అని ఉద‌య్‌కిర‌ణ్ స‌న్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మహత్య వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఏంటో పోలీసులు ఛేధిస్తే కాని అస‌లు నిజ‌యం తెలియ‌దంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: