జీవితంలో అన్ని విధాలా పరాజయం చెందిన ఉదయ్ కిరణ్ తన కళ్ళను మాత్రం మృతి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేసారు. ఎల్వీ ప్రసాద్ వైద్యులు ఈ రోజు ఉదయం ఉదయ్ కిరణ్ నేత్రాలలోని రెటీనాను సేకరించారు. అతడు లేకపోయినా తన కళ్లతో వేరొకరికి చూపుని ఇచ్చి సజీవంగా నిలిచాడు ఉదయ్ కిరణ్.  ఇక హీరో ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యపై రకరకాల కధనాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. ఆయన భార్య, అత్తమామలు, అపార్టమెంట్‌ వాచ్‌మెన్‌లను ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అపార్టమంట్‌ వాసుల నుంచి వివరాలు సేకరించారు. అయితే ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణం అంటూ తెలిపే ఒక లేఖ దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ విషయాన్నీ ఇంకా అధికారకంగా ఎవరు దృవీకరించడం లేదు. ఆత్మహత్య గా ఉదయ్ కిరణ్ మరణాన్ని చెపుతున్నా సమాధానం లేని ప్రశ్నలు పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. మరోక విషయం ఏమిటంటే ఉదయ్ కిరణ్ చనిపోయి ఇంత సమయం గడుస్తున్నా ఉదయ్ చుట్టాలు కానీ, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు కాని ఉదయ్ కిరణ్ భౌతికకాయం దగ్గరకు రాకపోవడం అంత్యక్రియలు గురించి మీడియా ప్రశ్నిస్తున్నా, ఎవరు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  జరుగుతున్న విషయాలు ఉదయ్ అభిమానులకే కాకుండా సాధారణ ప్రజానీకానికి కూడా షాకింగ్ న్యూస్ గా మారాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: