ఫిబ్రవరి 5వ తారీఖు పేరు వింటేనే ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ గజగజ లాడిపోతోంది. ఈరోజు తెల్లవారు ఝామున ఉదయ్ కిరణ్ మరణించడంతో టాలీవుడ్ విశ్లేషకులు ఒక ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ మధ్య వరుస పెట్టి టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలకు సంబంధించిన కధనం ఇది.  రియల్ స్టార్ శ్రీహరి గత సంవత్సరం అక్టోబర్ 9న ముంబాయ్ లో మరణిస్తే ఆ తరువాత హాస్య నటుడు ఎవిఎస్ గతసంవత్సరం నవంబర్ 8న మరణించారు. ఇక్కడితో ఈ పరంపర ముగియకుండా అదే గతసంవత్సరం డిసెంబర్ 7న మరొక ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుభ్రమణ్యం మరణించారు.  గత సంవత్సరంతో టాలీవుడ్ కు పట్టిన పీడ వదిలిపోయింది అని అందరూ ఆశిస్తున్న సమయంలో కొత్త సంవత్సరంలో ఐదు రోజులు గడవకుండానే హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించడం షాకింగ్ న్యూస్ గా మారడమే కాకుండా ఇలా నెలకు ఒకొక్కరు చొప్పున క్రమం తప్పని తారీఖుల వారిగా చనిపోతూ ఉండడంతో రాబోతున్న ఫిబ్రవరి నెల 5వ తారీఖు పేరు చెపితేనే టాలీవుడ్ లో అందరూ భయపడిపోతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి.  ఎదిఎమైనా టాలీవుడ్ పరిశ్రమను ఖంగారు పెడుతున్న ఈ భయాలు నిజాలు కాకుండా పరిశ్రమ లోని వారంతా సుఖంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: