సంక్రాంతి పండుగకి సినిమాల జోరు మాములుగా ఉండదు..ఇక టాలీవుడ్ లో ఈ ఇయర్ మరోసారి సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నారు మహేష్, చరణ్.. మహేష్ 1 సినిమాతో రాక్ స్టార్ గా వస్తుంటే.. రాం చరణ్ ఎవడు గా రాబోతున్నాడు. పబ్లిసిటీ పుంజుకున్న ఈ రెండు సినిమాలు ఎక్కడ తగ్గకుండా ప్రమోషన్ లో బిజీ బిజీ అయ్యారు.. ఇందులో చెప్పుకునే విషయం ఏంటంటే రెండు సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్ ఒకడే ఆయనే దేవిశ్రీ ప్రసాద్. సినిమా హిట్ లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో దేవి శ్రీ తన మార్క్ మ్యూజిక్ అందించి ఆడియో సూపర్ సక్సెస్ చేశాడు. ఎవడు మ్యూజిక్ ని ఎప్పుడో రిలీజ్ చేసిన ఫ్యాన్స్ ఇప్పటికీ పండుగ చేసుకుంటున్నారు. ఇక రిలీజ్ అయిన 1 సినిమా సాంగ్స్ హూ ఆర్ యు .. హు ఆర్ యు.. అంటూ అందరిని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. మరి ఈసారి సంక్రాతికి దేవి శ్రీ రెండు సినిమాలే పోటా పోటీ పడటం భలే అనిపిస్తుంది. వినసొంపైన మ్యూజిక్ తో యువతను ఎట్రాక్ట్ చేస్తున్న దేవి మ్యూజిక్ లో ఆడియెన్స్ పల్స్ ని పట్టుకున్నాడు. రాక్ స్టార్ మ్యూజిక్ ఇచ్చినా.. సూపర్ మెలోడీ ఇచ్చినా అది దేవికే సొంతం.. ఈ రెండు సినిమాల్లో కూడా మ్యూజిక్ ప్రాధాన్యత ఉంది. ఎవడు ఒక రివెంజ్ థ్రిల్ సినిమాగా వస్తుంటే ‘1’ సినిమా ఒక మంచి రాక్ స్టార్ సినిమాగా రాబోతుంది. సో మొత్తానికి దేవి ఏ సినిమా విజయమైనా సగం సంతోషం మాత్రమే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: