ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మ హ‌త్యపై క్లూస్ టీం రిపోర్ట్‌ను సేక‌రించింది. ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మహ‌త్యపై త‌న భార్య విషిత పిర్యాదు మేర‌కు పోలీసులు రంగంలోకి దిగి, ఈ కేసు వెన‌కు ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఏంటో క‌నుక్కునేందుకు ప్రయ‌త్నాల‌ను వేగ వంతం చేశారు. ఇది స‌హ‌జ‌మ‌ర‌ణ‌మా, ఎవ‌రైన ప్రేరేపించారా వంటి కోణాల్లో ద‌ర్యాప్తును చేస్తున్నారు. అయితే ప్రధ‌మ స‌మాచారంగా క్లూస్ టీం ఓ రిపోర్ట్‌ను రెడీ చేసింది. దానికి సంబంధించిన వివ‌రాల‌ను, పాయింట్స్‌గా బ‌య‌ట‌కు చెప్పింది. క్లూస్ టీం వివ‌రించిన రిపోర్ట్ ఈ విధంగా ఉంది. 1. ఉద‌య్ కిర‌ణ్ త‌న భార్యకు 'ఐ ల‌వ్ యు టూ' అనే మైభైల్ మెసేజ్‌ను పెట్టాడు. 2. అలాగే పోలీసులు ఉద‌య్‌కిర‌ణ్ భార్య విషిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అందులో విష‌త ఈ విధంగా చెప్పింది. 'త‌ను, త‌న స్లో కెరీర్‌తో చాలా కాలంగా డిప్రెష‌న్‌లో ఉన్నాడు. అలాగే చాలా సార్లు సూసైడ్‌కు క‌మిట్ అవ్వటానికి ప్రయ‌త్నించాడు. దీనికి సంబంధించిన‌ త‌న‌తో మాట్లాడ‌టం కూడ జ‌రిగిందట‌' 3. పోలీసులు ఉద‌య్ కిర‌ణ్ ప‌ర్సన‌ల్ ల్యాప్‌టాప్‌ను, మొబైల్‌ను సీజ్ చేశారు. ఏమైనా ఆధారాలు దొరికుతాయోమో అని చూస్తున్నారు. 4. తాడుతో ఉద‌య్ కిర‌ణ్ సూసైడ్ తీసుకున్నట్టుగా వారు నిర్ధారించారు. ఈ విధంగా క్లూస్ టీం ప్రాధ‌మికంగా వివ‌రాల‌ను వెల్లడించారు. అయితే ఈ కేసులో చాలా కోణాలు వెలికివ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. ఏదేమైనా యువ న‌టుడు ఇటువంటి ప్రయ‌త్నానికి పాల్పడం అంద‌రికి బాధ‌క‌లిగించే విష‌యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: