ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత ఆ హీరోకి వచ్చే క్రేజ్ ను కోట్లాది రూపాయలుగా హీరోలు మార్చుకుంటూ ఉంటారు. పవన్ బ్లాక్ బస్టర్ సినిమా ‘అత్తారిల్లు’ విడుదల అయి 100 రోజులు పూర్తీ అయినా పవన్ తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మొన్ననే క‌దా పెళ్లయ్యింది, ప‌వ‌న్ హ‌నీమూన్ మూడ్‌లో ఉన్నాడు అని చెప్పుకోవ‌డానికి లేదు. ఎందుకంటే పెళ్లయిన సంగ‌తి జనానికి ఈమధ్యనే తెలిసింది. కానీ ఆ ముచ్చట జరిగి మూడు నెల‌లు దాటిపోతోంది.  న‌వంబ‌రులో సెట్స్ పైకి వెళ్ళాలిసిన ‘గ‌బ్బర్ సింగ్ 2’ ను ముందుకు తీసుకెళ్లలేక‌పోయాడు. ఈ సినిమా వచ్చే నెల ప్రారంభం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము అంటు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ‘గ‌బ్బర్ సింగ్ 2’ లో ప‌వ‌న్ ఎప్పటిక‌ప్పుడు మార్పులు చేసుకొంటూ వ‌స్తున్నాడ‌ట‌. ఈ మార్పుల వ‌ల్ల కొత్త పాత్రలు ఈ సినిమాలో యాడ్ అవుతూ పోతున్నాయి. ఈ స‌డ‌న్ ఛేంజెస్ ద‌ర్శకుడు సంప‌త్ నందిని కూడా తెగ ఇబ్బంది పెడుతున్నాయ‌ని టాక్  కానీ ప‌వ‌న్‌ ముందు ఏమీ అన‌లేక పోతున్నాడట. దీనికి తోడు ఈ సినిమా పాటలకు సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ కూడా ప్రారంభం కాలేదని అంటున్నారు. దీనికి తోడు ఈ మధ్య పవన్ లేటెస్ట్ మ్యారేజ్ వార్తల నేపధ్యంలో మౌనముద్రలోకి వెళ్ళిపోయిన పవన్ తన మౌనం వీడేదాకా ఈ సినిమా ప్రారంభం కాదేమో అనే వార్తలు కూడా వినపడుతున్నాయి.  సామాన్యంగా పవన్ మీడియాకు దూరంగా ఉంటాడు. కానీ ఈమధ్యనే తన పద్ధతి మార్చి మీడియాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈలోపున వచ్చిన పెళ్లి వార్తల నేపధ్యంలో మీడియాకు అందకుండా ఎంతకాలం పవన్ దాగుడుమూతలు ఆడతాడు అంటూ పవన్ పై సెటైర్లు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: