సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భీమవరం బుల్లోడు' ‘Short Time’ అనే ఇంగ్లీష్ సినిమా ఆధారంగా రూపొందుతోందని వార్తలు వినపడుతున్నాయి. పిరికివాడైన హీరో ఎలాగూ తాను త్వరలో చనిపోతానని తెలుసుకుని లేని మొండి ధైర్యం తెచ్చుకుని సాహసాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు సంఘ వ్యతిరేక శక్తులను కూడ ఎదిరిస్తాడు.  అయితే తర్వాత తాను చనిపోవటం లేదని తెలుసుకుంటాడు. అంతేకాదు తనకు డాక్టర్ ఇచ్చినవి తప్పుడు మెడికల్ రిపోర్టులు అని తెలుసుకుంటాడు. అప్పుడు అతినిలో నిజమైన భయం మొదలవుతుంది. ఈ విషయం తను మొండి ధైర్యంతో ఎదిరించిన విలన్స్ కు సైతం తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందనేది మిగతా కథ.  ఇలాంటి కథే ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కాన్సర్ పేషెంట్ ని అనుకున్న సునీల్ మొండితనంతో సాహసాలు చేయటం తర్వాత తనకు కాన్సర్ లేదని తెలిసితాను చేసిన పనుల మధ్య ఇర్కుపోవడం ఈ సినిమా కధ అని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది.  సంక్రాంతి బరిలో నిలుద్దామని సునీల్ ధైర్యం చేసినా మహేష్, చరణ్ ల పోటీ మధ్య ఈ సినిమా నిలబదలేదేమో అని భావించి ఆఖరి నిముషంలో ఈ సినిమా విడుదల వాయిదా వేసారు అనే వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: