ఉదయ్ కిరణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియచేశారు.. ఇండస్ట్రీ అంటేనే ఒక మాయ దీనిలో అవకాశం వచ్చి సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉన్నామో అవకాశాల్లేక పోయినా సరే అంతే కాన్ ఫిడెంట్ తో ఉండాలి. ఉదయ్ ఆత్మ హత్య కు స్పందిస్తూ హీరో శివాజి తన మనసులో మాటని చెప్పారు. ఉదయ్ చాలా తప్పు పనిచేశాడు ఎందుకంటే ఫెల్యూర్ సక్సెస్ అనేవి ఈ ఇండస్ట్రీ లో కామన్ కాబట్టి ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మనల్ని నమ్ముకున్న వారిని మోసం చేసిన వారిమవుతామని అన్నాడు. నేను ఇండస్ట్రీ కి వచ్చి 17 యేళ్లు అయ్యింది ఇంతవరకు సాధించినది ఏమీ లేదు అయినా పోరాడుతూనే ఉన్నా ఉదయ్ లా సూసైడ్ చేసుకుంటే నేను ఏ 20 , 30 సార్లు చేసుకోవాల్సి వచ్చేదో అన్నారు శివాజి. ఇలా భాదపడ్డప్పుడల్లా చనిపోవాలి అనుకుంటే తను ఎన్నో సార్లు చనిపోయేవాడట.. భాదలు అందరికీ ఉంటాయి కానీ వాటిని మనమే పరిష్కరించుకోవాలి ఇలా అందరిని వదిలి వెళ్లే నిర్ణయం తీసుకోకూడదు అని అన్నారు శివాజి. తమ డిఫరెంట్ డిఫరెంట్ నటనతో ఆడీయెన్స్ ని అలరిస్తున్న హీరోలు ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీ మొత్తం భాద పడాల్సి వస్తుంది. ఇక ఉదయ్ మరణం ఇప్పటి యూత్ హీరోలకు కూడా ఒక లెసన్ అవ్వాలని తొందరపాటు నిర్ణయం వలన తమ జీవితాన్నే కోల్పోవాల్సిన అవసరం లేదని అన్నారు సినీ ప్రముఖులు. అవకాశం కోసం వెయిట్ చేయాలి వచ్చిన చాన్స్ ని సద్వినియోగ పరచుకుని తమలో టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి కాని ఇలా జీవితాన్ని బలి తీసుకునే తొందరపాటు చర్యలు చేయవద్దని అన్నారు. ఉదయ్ మరణం టాలీవుడ్ మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: