చిత్రం సినిమాతో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా నిలబడగలిగాడు ఉదయ్ కిరణ్.. నువ్వు నేను.. మనసంతా నువ్వే లాంటి హిట్ సినిమాలతో లవ్ బోయ్ ఇమెజ్ ని సొంతం చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ మొన్న నైట్ ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. అసలు ఉదయ్ అలా చేయడానికి కారణం ఏమైఉంటుంది అని అందరు ఆలోచిస్తున్నారు..నిన్న డైరక్టర్ తేజ ఆవేశపూరితంగా ఉదయ్ ఈ స్థితికి రావడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు అని.. ముఖ్యంగా మీడియా వారిని ఉద్దేశించి మీకైతే ఇంకా బాగా తెలుసని చెప్పాడు. తేజ లా ఎందు కన్నాడని అందరు ఆలోచించడం మొదలెట్టారు. ఉదయ్ కిరణ్ మంచి ఫాం లో ఉన్నప్పుడు చిరంజీవి పెద్ద కూతురిని ఇచ్చి పెళ్లి చేద్దామని అప్పట్లో నిర్ణయించుకున్నారు..మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఎంగేజ్ మెంట్ దాకా వచ్చినది కాస్తా ఆగిపోయి చిరు ఆమెను వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేశాడు. అప్పటినుండి పట్టుకుంది చిరంజీవి ఉదయ్ కి అన్యాయం చేశాడని ఇంకాస్త లోతుగా వెళ్లి పరిశీలిస్తే ఉదయ్ కి సినిమాలు కూడా రాకుండా అడ్డుతగిలాడని మాటలు వినిపించాయి. కానీ వాటిల్లో వాస్తవం లేదని చాలామంది పెద్దలు అంటున్నారు. ఉదయ్ కెరియర్ మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వడానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఉదయ్ చనిపోయాడు అదీ సూ సైడ్ చేసుకుని.. సినిమా అవకాశాల్లేక సూసైడ్ చేసుకున్నాడని పై మాటలు వినిపిస్తున్న తమిళ్ లో రెండు మంచి ప్రాజెక్ట్స్.. తెలుగు లో ఆల్రెడీ ఒక సినిమా రెడీ గా ఉన్నాయి ఉదయ్ కిరణ్ కి.మరి ఎందుకు ఉదయ్ సూసైడ్ చేసుకున్నాడని సాధారణ ఆడియెన్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు మెగా ఫ్యామిలీని అనడం ఏమాత్రం పద్దతి కాదు అని వాపోతున్నారు కొందరు సినీ పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి: