మంచు వారి ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తున్న సినిమా పాండవులు పాండవులు తుమ్మెద శ్రీ వాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అరియానా విరియానా సమర్పణలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ తో మంచు విష్ణు , మనోజ్ లు ప్రొడ్యూస్ చేస్తు న్నారు.. ఈ సినిమా ప్రోమో సాంగ్ టీజర్ ఈరోజే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తుమ్మెద తుమ్మెద వండర్ఫుల్ తుమ్మెద అని సాగే ఈ సాంగ్ టీజర్ లో 5 హీరోలతో పాటు బాబా సెహగల్ హీరోయిన్లు రవీనా టాండన్, హన్సిక, ప్రణీత కూడా హడావిడి చేస్తున్నారు. ఈ సాంగ్ లో హీరోలు హీరోయిన్లు ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు బప్పిలహరి తో పాటు కీరవాణి , మణిశర్మ లు కూడా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. జనవరి 31 న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. వరుస హిట్లతో జోరు మీదున్న హాన్సిక, ఒక్క హిట్ తో ఊపందుకున్న ప్రణిత ఇంకా చాలా రోజుల తర్వాత రవీనా టాండన్ తెలుగులో నటిస్తున్న సినిమాగా ఈ సినిమా సూపర్ క్రేజ్ ని సంపాదించింది. ప్రస్తుతం సినిమా పబ్లిసిటీ లో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో అన్ని సినిమాల ప్రొడ్యూసర్స్ సినిమా పై ఆడియెన్స్ కి ముందు ఒక ఫీల్ వెచ్చేలా పబ్లిసిటీ చేస్తున్నారు.. ఆకోవలోనే పాండవులు పాండవులు తుమ్మెద సినిమాకు మంచు వారు హీరోలు మోహన్ బాబు, విష్ణు , మనోజ్ తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న మరో ఇద్దరు హీరోలు వరుణ్ సందేష్, తనీష్ లు డ్యాన్స్ చేసి సినిమాపై క్రేజ్ ని పెంచేస్తున్నారు. మరి ఇన్ని కలర్ ఫుల్ కాంబినేషన్స్ ఉన్న ఈ సినిమా మంచు ఫ్యామిలీకి, అటు హిట్ కోసం సతమవుతున్న చిన్న హీరోలకు సూపర్ హిట్ అయ్యి మొత్తం టోటల్ టీం కు మంచి పేరు రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: