రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వంద కోట్ల భారీ బడ్జెట్‌ సినిమా 'బాహుబలి' కి ఇంకా విడుదల కాకుండానే సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కర్ణాటక,కర్కాళ కి చెందిన జైన మఠం నుంచి లీగల్ నోటీస్ ఇష్యూ చేసినట్లు వార్తలు వస్తున్నాయి  హింసాత్మక చిత్రoగా నిర్మిస్తున్న 'బాహుబలి' కి ఆ టైటిల్ పెట్టవద్దని ఆ నోటీసులో కోరినట్లు తెలుస్తోంది. బాహుబలి విగ్రహం కర్ణాటక లోని శ్రావణబెళగొళ లో ఉంది అని వారి వాదన. నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు అని అంటున్నారు.  జైనుల నమ్మకం ప్రకారం బాహుబలి మరియు భరత ఇరువురూ రాజకుమారులు. తమ ఆధిపత్యం కొరకు ఒకరితో మరి ఒకరు పోరాడుతారు. పోరాటంలో గెలిచిన బాహుబలి తన తమ్ముడిని క్షమించి వదిలేస్తాడు. ఇదే సమయంలో యుద్ధం, చంపుకొనటం వంటివి ప్రయోజనంలేనివిగా బాహుబలి గుర్తిస్తాడు. వెంటనే తన రాజ్యాన్ని తమ్ముడు భరతుడికి అప్పగించి దిగంబర జైన మతంలో చేరపోతాడు. మోక్షానికి మార్గం కోరుతూ బాహుబలి తనకు దివ్యత్వం చేకూరే వరకు దిగంబరంగా ఉండిపోతాడు. ఇది జైనుల మతానికి సంబంధిన కధ.  అటువంటి పవిత్రమైన కధకు ఒక జానపద కధను సృష్టించి యుద్ధాలు, పాటలతో సినిమా తీసి తమ మనోభావాలు దెబ్బ తీయవద్దని జైన మఠం వారు రాజమౌళిని కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల పై మన జక్కన్న ఎలా ప్రతిస్పందిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: