యువ సినీ న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ ఆత్మహ‌త్య, టాలీవుడ్‌లో అత్యంత విషాద సంఘ‌ట‌న‌గా మారింది. గ‌త శతాబ్ధకాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఆత్మహ‌త్యలు అనేవి విభేదాల‌తో వ‌చ్చిన‌వి త‌ప్పితే, ఆఫ‌ర్లు లేక చ‌నిపోయిన వారు లేనేలేరు. ఆఫ‌ర్స్ లేక చ‌నిపోయో బ‌దులు, మ‌రో ప‌నితో జీవనాన్ని కొన‌సాగిద్ధాం అనే వాళ్ళు ఇండ‌స్ట్రీలో కోక‌ల్లలు ఉన్నారు. కాని అంద‌రికి భిన్నంగా, ఎన‌లేని అభిమానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మహ‌త్య అంద‌రిని క‌ల‌చి వేసింది. ఇదిలా ఉంటే ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మహ‌త్యకు కార‌ణం చిరంజీవి పరోక్ష పాత్ర పాటించాడు అనేది ఇండ‌స్ట్రీలో ఓ వాద‌న వినిపిస్తుంది. అవకాశాల‌ను ద‌గ్గర‌కు రాకుండా చేయ‌టంలో చిరంజీవి స‌ఫ‌లీకృతుడు అయ్యాడ‌ని కొంత‌మంది బ‌హిరంగంగానే చెబుతున్నారు. దీంతో చిరును టార్గెట్ చేసే ఓ వ‌ర్గం గొంత‌ను పెద్దది చేసింది. ఉద‌య్‌కిర‌ణ్‌ను చివ‌రి చూపుగా చూద్ధామ‌నుకునే సెల‌బ్రిటీలు ఈ రోజు ఉద‌యాన్నే అక్కడ‌కు చేరుకున్నారు. ఇందులో ద‌ర్శక‌ర‌త్న దాస‌రి కూడ ఉన్నారు. ఉద‌య్‌కిర‌ణ్‌ను క‌డ‌సారిగా చూసిన దాస‌రి, త‌న ఆత్మహ‌త్య కొంద‌రి వ‌ల్లే జ‌రిగింద‌ని స్పష్టం చేశాడు. కొంత మంది కావాల‌నే అవ‌కాశాల‌ను దూరం చేశార‌ని, ఆ పాప‌మే నేడు ఇలా త‌గిలింద‌ని చెప్పుకొచ్చాడు. ఈ విధంగా దాస‌రి మాట్లాడ‌టంతో త‌ను ఎవ‌రిని అంటున్నాడో అంద‌రికి ఇండైరెక్ట్‌గా తెలిసిపోయింది. చిరు ప్యామిలికు సంబంధించిన ఏ హీరోలు, ఉద‌య్‌కిర‌ణ్‌ను చూడ‌టానికి రాలేదు. ఏదేమైనా ఆత్మహ‌త్య చేసుకోకుండా మ‌రోలా ఆలోచించి ఉంటే బాగుండేది అని టాలీవుడ్ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: