టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఆధిప‌త్య పోరు కొన‌సాగుతుంద‌ని ఎప్పటి నుండో తెలిసిన విష‌య‌మే. అయితే ఈమ‌ధ్య కాలంలో ఈ త‌ర‌హా కుట్ర పూరిత ప‌ద్దతులు టాలీవుడ్‌లో బ‌హిరంగంగానే జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా బాక్సాపీస్ వ‌ద్ద ధియోట‌ర్ల ఆధిప‌త్యం అనేది పెద్ద మ‌నుషుల మ‌ధ్య కొన‌సాగుతుంది. అయితే ఈ నెల‌లోనే రెండు పెద్ద మూవీలు బాక్సాపీస్‌ను త‌ల‌ప‌డ‌నున్నాయి. వాటిలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు వ‌న్ మూవీ, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఎవ‌డు మూవీలు వ‌రుస‌లో ఉన్నాయి. కేవ‌లం ఒక్క రోజు గ్యాప్‌లోనే ఈ రెండు మూవీలు రిలీజ్ అవుతున్నాయి. వ‌న్ మూవీ జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఒక్క హైద‌రాబాద్‌లోనే 108 ధియోట‌ర్లలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అయితే వ‌న్‌ మూవీకు ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న ఎవ‌డు మూవీకు ధియోట‌ర్లు క‌రువ‌య్యాయి. టాలీవుడ్ బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు పొందిన దిల్‌రాజు మూవీకే ధియోట‌ర్లు క‌రువ‌య్యాయంటే ఇది ఎవ్వరూ న‌మ్మలేకున్నారు. అందుకే వ‌న్ మూవీకు ఖ‌న్‌ఫ‌ర్మ్ అయిన ధియోట‌ర్లలో ప‌దిశాతం ధియోట‌ర్లను క్యాన్సిల్ చేసుకోవాల‌ని, కొంద‌రు ఆ ధియోట‌ర్ య‌జ‌మానులను సంప్రదించిన‌ట్టుగా టాలీవుడ్‌లో క‌థానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రిన్స్ హావాను బాక్సాపీస్ వ‌ద్ద అడ్డుకోవ‌డానికి జ‌రుగుతున్న మెగా ప్రయ‌త్నంగా చిత్రసీమ అభివ‌ర్ణిస్తుంది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో అనేది చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: