అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం పై ఈరోజు ఉదయం ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తల నేపధ్యంలో ఆయన ఆరోగ్యం పై వెబ్ మీడియాలో కూడ రకరకాల వార్తలు కొద్దిసేపు హడావిడి చేసాయి. అయితే ఈ వార్తలను అటు నాగార్జున ఇటు సుమంత్ లు ఖండించడంతో అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  ఈ నేపధ్యంలో అక్కినేని ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయం పై క్లారిటి లేకపోయినా అక్కినేని నిన్న పవన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’ తన ఇంటిలో చూసారు అనే వార్తలు వినపడుతున్నాయి. అక్కినేని 90వ సంవత్సరంలో ఉన్నా మొన్నటిదాకా వేదికల మీద హీరోయిన్స్ పై సెటైర్లు వేయగల ఉత్సాహం ఆయనది. ఆయన గతంలో ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన ఆఖరి క్షణం వరకూ సినిమాలను ప్రేమిస్తానని, సినిమాలలో నటిస్తూనే ఉంటానని గతంలో చెప్పారు అక్కినేని.  ఆ మాటలను నిజం చేస్తూ అక్కినేని నాగేశ్వరరావు, పవన్ ‘అత్తారిల్లు’ చూడడం ఒక హాట్ టాపిక్ అయితే పవర్ స్టార్ కు అక్కినేని ఎన్ని మార్కులు వేసారో తెలియాలి అంటే తిరిగి అక్కినేని పూర్తిగా కోలుకునే వరకు ఆగాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: