బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాస బ‌సు త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుతుంది. అయితే ఆ వేడుక‌ల్లో నానా భీభ‌త్సం సృష్టించిన బిపాస‌బ‌సుకి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఖాత‌రు చేయ‌కుండా త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా ప్రవ‌ర్తించింది. ఇదంతా బిపాస‌బసు పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న జరిగిన ఈవెంట్‌లో జ‌రిగింది. త‌న పుట్టిన రోజు వేడుక‌లను ప‌గ‌లు రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా జ‌రుపుకొని, రాత్రి స‌మ‌యాన మాత్రం త‌న స్నేహితుల‌తో జ‌రుపుకుంది. స్నేహితుల‌తో త‌ను ఉంటున్న అపార్ట్‌మెంట్ పై భాగం టెర్రస్‌ మీద డి.జె సౌండ్‌తో ధ‌మ్మురేపింది. పెద్ద పెద్ద శ‌బ్ధాల‌తో టెర్రస్ అంతా మారు మోగిపోయింది. దీంతో నిద్రప‌ట్టని అపార్ట్‌మెంట్ వారు, ప‌క్కన ఉన్న బిల్డింగ్స్ వారు ఆ ఈవెంట్‌పై పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగి బిపాసాబ‌సు జ‌రుపుకుంటున్నబ‌ర్త్‌డే వేడుక‌ల ద‌గ్గర‌కు వ‌చ్చారు. వెంట‌నే డి.జె సౌండ్‌ను ఆపాల్సిందిగా బిపాస‌ను కోరారు. కాని బిపాస మాత్రం త‌న డ్రైవ‌ర్‌ను పంపించి మేట‌ర్‌ను సెటిల్ చేయ‌మంది. ఇంకేముంది డ్రైవ‌ర్ వెళ్ళి ముంబై పోలీసుల‌కు న‌చ్చజెప్పాడు. అయితే వాళ్ళు సౌండ్‌ను మాత్రం త‌గ్గించండి అని కోరారు. కాసేపు సౌండ్‌ను త‌గ్గించిన‌ట్టే త‌గ్గించి, ఓ గంట త‌రువాత మ‌ళ్ళీ రెచ్చిపోయారు. ఈసారి పోలీసుల‌కు చిర్రొత్తి డి.జె సిస్టమ్‌ను తీసుకొని వెళ్ళిపోయారు. చేసేదేమి లేక బిపాస బ‌సు మాత్రం త‌న స్నేహితుల‌తో మొబైల్ మ్యూజిక్‌తోనే ఎంజాయ్ చేసింద‌ట‌. పోలీసుల‌తో పెట్టుకుంటే ఇలాగే ఉట్టుందంటున్నారు బిటౌన్ వాల‌.

మరింత సమాచారం తెలుసుకోండి: