మళయాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించిన సినిమా 22 ఫిమేల్ కొట్టాయం. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ మాలిని 22.. ఈ సినిమా జనవరి 24 న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలొ తెరకెక్కిన ఈ సినిమా, సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాల పై విబిన్న కథాశంతో రూపొందించారు, ఈ చిత్రంలో క్రిస్ సత్తార్, కోట శ్రీనివాస రావ్, కోవైసరళ తదితరులు నటించారు. నిత్య ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసిందని చిత్ర దర్శకురాలు శ్రీ ప్రియ ప్రెస్ మీట్ లో చెప్పారు. అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తూ యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నిత్య.. నేటితరం సౌందర్య బిరుదు సాదించిన నిత్య మాలిని 22 సినిమాలో ఇంకొంచం తన నట విస్వరూపాన్ని చూపించబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. జనవరి వార్ లో నేను కూడా వస్తున్నానంటూ ఈ సినిమాతో నిత్య సినిమాల బరిలో దిగుతుంది. అసలే సినిమాల రిలీజ్ చార్ట్ పెద్దదిగా మారిన ఈ జనవరి నెలలో మాలినిగా నిత్య కూడా రావడం మెచ్చుకోదగ్గ విషయమే..ఎందుకంటే పోటా పోటీగా సాగుతున్న తారల సినిమాల రిలీజ్ లో ఈ సినిమా కొట్టుకుపోకుండా ఉంటే చాలు అని అనుకుంటున్నాయి సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: