ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మహ‌త్యపై మెగా ప్రొడ్యూజ‌ర్ ఎ.యం.ర‌త్నం స్పంధించాడు. టాలీవుడ్‌లో సంచల‌నం రేపిన య‌వ న‌టుడు ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మహ‌త్యను టాలీవుడ్‌లోని బ‌డా వ‌ర్గాల ఆధిప‌త్యం మూలంగానే జ‌రిగింద‌ని కొంద‌రు అభివ‌ర్ణిస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేద‌ని ఇదంతా మీడియా సృష్టే అని టాలీవుడ్‌లోని ఒ వ‌ర్గం కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉద‌య్‌కిర‌ణ్, ధ్విభాష చిత్రంగా రూపొందుతున్న ఎ.యం.ర‌త్నం మూవీ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న త‌రువాత ఆ మూవీ అనూహ్యంగా ఆగిపోయింది. దీనికి కార‌ణం ప్రత్యక్షంగా చిరంజీవే కార‌ణం అంటూ హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంలో ఎం.యం.ర‌త్నం మీడియాతో మాట్లాడిన‌ట్టు, దాన్ని ఓ డెయిలీ ప‌బ్లికేష‌న్ ప్రచురించిన‌ట్టు కొన్ని ఆధారాలు సోషియ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో హ‌ల్‌చ‌ల్ అవుతున్నాయి. అయితే ఈ వార్త కోళీవుడ్ మీడియా వ‌ర‌కూ చేరుకుంది. 'తెలుగు హీరో మాట‌ల‌కు భ‌య‌ప‌డి ఏ.యం.ర‌త్నం మూవీను ఆపుకున్నాడు, ఆ హీరో ఇప్పుడు ఆత్మహ‌త్య చేసుకున్నాడు' అంటూ కోలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే ఏ.యం.ర‌త్నం ఇందుకు స్పంధించాడు. 'కోలీవుడ్ మీడియాలో వ‌స్తున్న వార్తల్లో కొంతే నిజం ఉంద‌ని, అయితే నా మూవీ అగిపోయినందుకే ఆ హీరో ఆత్మహ‌త్య చేసుకోలేద‌ని, ఇటువంటి కారాణాలు అనేకం ఎదురుకావ‌డంతో అలా జ‌రిగి ఉండ‌వ‌చ్చని, ఇందులోకి న‌న్ను ఎట్టి ప‌రిస్థితుల్లో లాగొద్దని' వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: