ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ అంటే టాలీవుడ్ బాక్సాపీస్‌కు షేకింగ్ అవ్వాల్సిందే. మ‌రి ప‌వ‌న్ అభిమానుల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఏమి ఉండ‌దూ. ఎందుకంటే ఇండ‌స్ట్రీలోనూ, సిని అభిమానుల్లోనూ అంతా ప‌వ‌నిజ‌మే. ఇంతటి స్టార్‌డంను క్రియోట్ చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాన్‌, అత్తారింటికి దారేది స‌క్సెస్ మీట్ త‌రువాత అంద‌రికి దూరంగా ఉంటున్నాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే ప‌వ‌న్ అంత‌రంగికుడుగా చెప్పుకునే త్రివిక్రమ్ సైతం ప‌వ‌న్‌కు ఈ మ‌ధ్య కాలంలో దూరంగా ఉంటున్నాడు. కార‌ణం మాత్రం పెద్దగా లేక‌పోయిన‌ప్పటికీ, ప‌వ‌న్ మూడో మ్యారేజ్‌పై వ‌స్తున్న కొద్ది పాటి నిర‌స‌న‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎటువంటి ఆడియో ఫంక్షన్స్‌కు హాజ‌రు కాకుండ‌ని నిర్ణయించుకున్నాడు. త్వర‌లోనే మెగా హీరోల మూవీలు రిలీజ్‌కు ద‌గ్గర ప‌డుతున్నా, వాళ్ళకూ దూరంగానే ఉంటున్నాడు. 'నన్ను ప్రమోష‌న్స్ అంటూ ఇప్పట్లో ఇబ్బందిపెట్టవ‌ద్దు' అంటూ అబ్బాయ్‌ల‌కు మెసేజ్ ఇచ్చాడ‌ని టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మెగా హీరోలు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రేయ్ ఆడియో ఫంక్షన్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం సాధ్యం కాద‌నే విష‌యం తేలిపోయింది. అలాగే కొత్తజంట‌ మూవీను ఫిబ్రవ‌రి రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌కు సైతం మొద‌ట‌గా ప‌వ‌న్ వ‌స్తాడ‌ని మాట ఇచ్చాడ‌ట‌. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ రాడ‌ని తేలిసిపోవ‌డంతో, ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్న మెగా హీరోల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లిస్సింగ్స్ తోటు లేక‌పోవ‌డంతో ఒకింత నిరుత్సాహాన్ని మిగిల్చింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: