పోర్న్ మూవీస్ కి బై చెప్పి బాలీవుడ్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది సన్నీ లియోన్.. జిస్మ్ సినిమా అమ్మడికి సూపర్ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. తను చేస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయినా దర్శకనిర్మాతలు మాత్రం ఆమెను వదలట్లేదు. ఇప్పుడు సౌత్ సినిమాలవైపు కూడా కన్నేసిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఒక తమిళ్ సినిమాలో ఐటం సాంగ్ కి ఓకే అనేసింది. తమిళ తంబీలను తన మైకంలో పడేసుకునేందుకు నడుముకట్టిన సన్నీ ఆ ఐటం సాంగ్ చేయడానికి పెద్ద మొత్తాన్నే వసూలు చేస్తుందట. కోలీవుడ్ సమాచారం ప్రకారం సన్నీని ఈ ఐటం సాంగ్ కి ఒప్పించడానికి కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట ఆ ప్రొడ్యూసర్. తన అందచందాలతో కుర్రకారుని మతులు పోగొడుతున్న ఈ అమండిని ఇంతకి బుక్ చేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరో ఇంకా తెలియలేదు.. అంతేకాదు సన్నీ ఏ సినిమాలో ఐటం సాంగ్ చేయనుందో కూడా తెలియదు. కెరియర్ పరంగా ముందుకు సాగాలంటే ఒక్క బాలీవుడ్ లో నే చేస్తే సరిపోదు అనుకున్న సన్నీ సౌత్ లో కూడా సినిమాలు ఓకే చేయడం చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఆడియెన్స్ కి కూడా చెమటలు పట్టించే చేస్తుందని అనుకుంటున్నాయి సౌత్ సినీ వర్గాలు. రీసెంట్ గా జాక్ పాట్ లో అందాలు కురిపించినా ఫ్లాప్ అవ్వడంతో డిలా పడ్డ ఈ వగలాడి ఇప్పుడు ఈ భారి రెమ్యునరేషన్ ఆఫర్ తో హ్యాపీగా ఓకే అనేసిందట. సో సౌత్ లో రాబోతున్న హాటీ కి వెల్ కం చెప్పేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: