టాలీవుడ్ సినిమా రంగంలో రాజమౌళి తరువాత క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన సుకుమారు తాను దర్శకత్వం వహించే సినిమాలను కూడ రాజమౌళి లాగే తెగ చెక్కుతాడు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు రేపు విడుదల కాబోతున్న మహేష్ ‘1’ నేనొక్కడనే సినిమా గురించి ముఖ్యంగా ఈ సినిమాలో బుల్లి మహేష్ గా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్న గౌతమ్ గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఆ పత్రికతో షేర్ చేసుకున్నాడు సుకుమార్.  ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఒకరోజు ఒక సన్నివేసం గురించి దర్శకుడు సుకుమార్, గౌతమ్ కు ఒక అరగంట వివరించిన తరువాత అంతావిని గౌతమ్ “ఇది అంతా ఎందుకు అంకుల్, ఇది శాడ్ సీనా లేదంటే హ్యాపీ సీనా ఇది మాత్రం చెప్పండి, దీనినిబట్టి నటిస్తాను అన్నాడట’ దానితో సుకుమార్ షాక్ అవడమే కాకుండా మొత్తం యూనిట్ అంతా గౌతమ్ తెలివితేటలకు ఫిదా అయిపోయారట. అదేవిధంగా ఒకరోజు తన పాత్రకు డబ్బింగ్ చెపుతూ ‘అంకుల్ మరొకసారి చెప్పమంటారా లేదంటే ఇది సరిపోతుందా’ అంటు ఎదురు ప్రశ్న వేసాడట చిన్నోడు.  అంతేకాదు మహేష్ బాబు పై ఒక పాటను తీస్తున్న సమయంలో సెట్లోకి వచ్చిన గౌతమ్ కృతి సనన్ ఆంటీ తో నాకు ఎందుకు పాట సీన్ లేదు అని అడగడంతో ఏమనాలో తెలియక గౌతమ్ వంక నవ్వుతూ చూసాడట సుకుమార్. మరొకరోజు సుకుమార్ ఒక ఫ్లోర్ లో మహేష్ బాబు పై సన్నివేశాలు తీస్తూ మరొక ఫ్లోర్ లో గౌతమ్ పై ఈ సినిమాకు సంబంధించి సన్నివేశాలు తీసాడట. షూటింగ్ గేప్ రాగానే సెట్ నుంచి బయటకు వచ్చిన గౌతమ్ తన తండ్రి వేన్ లో ఎక్కి కూర్చుని ఒక పెద్ద హీరోలా ఫోజు ఇస్తూ సీరియస్ గా తాను తెచ్చుకున్న కామిక్స్ పుస్తకాలు చదువుకుంటూ సుకుమార్ మళ్ళీ షాట్ కు రెడీ చెప్పే వరకు వేన్ లోనే ఉండిపోయాడట.  ఇవ్వన్నీ చూస్తూ ఉంటే తనకు గౌతమ్ మహేష్ ను మించిన హీరో అయిపోతాడా అని అనిపిస్తోందని సుకుమార్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: