మహేష్ ‘1’ నేనొక్కడినే మరి కొద్ది గంటలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఓవర్సీస్ లో 250ధియేటర్లలో విడుదలై పవన్ ‘అత్తారిల్లు’ ఓవర్సీస్ రికార్డును బ్రేక్ చేద్దామన్న మహేష్ కలలపై ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న మంచు తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి.  మహేష్ కు ఓవర్సీస్ మార్కెట్ లో ముఖ్యంగా అమెరికాలో ఉన్న క్రేజ్ రీత్యా అత్యధిక ధియేటర్లలో అమెరికాలో విడుదల చేస్తే కలెక్షన్స్ భారీగా వస్తాయని ముందు నుంచి ఈ సినిమా నిర్మాతలు ఆలోచిస్తూ వచ్చారు. దీనికి కారణం గత సంవత్సరం విడుదల అయిన మహేష్ సీతమ్మ వాకిట్లో 10 కోట్లు వసూలు చేసి ఓవర్సీస్ రికార్డును నేకోల్పింది.  అదే విధానాన్ని కొనసాగిస్తూ మరో కొత్త రికార్డు క్రియేట్ చేద్దామనుకున్న మహేష్ ఆశలకు ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న వాతావరణ పరిస్థుతులు పెద్ద ప్రతిబంధకంగా మారునున్నాయి. అమెరికాను కుదేపెస్తున్న ఈ మంచు తుఫాన్ మూలంగా చాల రాష్ట్రాలలోని ప్రజలు బయటకు రాని పరిస్థుతులు ఏర్పడ్డాయి.  ప్రస్తుతం అమెరికాలో చాల చోట్ల మైనస్ 15 డిగ్రీల నుండి మైనస్ 35 డిగ్రీల వరకు చలి గాలులు వీస్తూ ఉండడమే కాకుండా చాల చోట్ల నదులు కూడ ఐస్ గడ్డల్లా మారిపోవడమే కాకుండా చాలామంది తెలుగు వాళ్ళు ఉండే న్యూయార్క్ సిటీలో కూడ మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్ కొనసాగుతూ ఉండడంతో ఈ వ్యతిరేక వాతావరణ పరిస్థుతుల ప్రభావం మహేష్ ‘1’ సినిమాపై ఉంటుంది అని అంటున్నారు. ఏమైనా మంచు తుఫాన్ టాలీవుడ్ ప్రిన్స్ కు గట్టిదేబ్బే అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: