'ప్రిన్స్ మహేష్ బాబు' నటించిన 'వన్' (నేనొక్కడినే)సినిమా హిట్ అవుతుందా ? ఫట్టావుతుందా ? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం 'వన్' సినిమా విడుదలవుతోంది. నగరంలోని పలు థియేటర్ ల ఎదుట అభిమానులు భారీగా క్యూలో నిలుచున్నారు. ఎలాగైనా సినిమా చూడాలని, ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు పక్కాగా పేర్కొంటున్నారు. నగరంలో 670పైగా షోలు ప్రదర్శితం కావడం రికార్డు అని టాలీవుడ్ పేర్కొంటోంది. సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్ ఎంటర్ ట్రైన్ మెంట్ ఈ సినిమాను రూపొందించింది. 'మహేష్' సరసన 'కృతిసనన్' నటించింది. ఇటీవల ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ కెరీర్ లో మొదటిసారిగా మహేష్ సినిమాకు మ్యూజిక్ అందించారు. మహేష్ ఇంతవరకు ఇలాంటి కథ చేయలేదని, సరికొత్త కథతో ముందుకొచ్చారని తెలుస్తోంది. భారీ యాక్షన్ ఓరియెంటెండ్ కథతో రూపొందిన 'వన్' సినిమా విజయం సాధిస్తుందా ? లేదా అన్నది కొద్దిసేపట్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: