రాష్ట్ర వ్యాప్తంగా మహేష్ ‘1’ నేనొక్కడినే సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు అన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. తమ అభిమాన హీరో మహేష్ సినిమా మొదటి ఆట టిక్కెట్ దొరికితే చాలు లాటరీ తగిలినంత ఆనందంగా సంబర పడిపోతున్నారు.  తెలుస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా స్పెషల్ షోలు పూర్తి అయి అభిమానుల ప్రతిస్పందన బయటకు వస్తోంది. అభిమానులు చెపుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ సినిమా స్థాయిలో సుకుమార్ ఈ చిత్రం తీసాడని అంటున్నారు. సాంకేతి పరంగా సినిమా చాలాబాగుంది అని మెచ్చుకుంటున్నారు.  అయితే సినిమా కధ తమ అంచనాలను అందుకోలేదని అంతేకాకుండా సినిమా రెగ్యలర్ తెలుగు ఫార్మెట్ లో లేదనీ కమర్షియల్ విలువలు కూడ చాల తక్కువగా ఉన్నాయని అంటున్నారు. సినిమా చాల నెమ్మదిగా నడవడం సినిమాలోని గ్రాఫిక్స్ కూడ అంత బాగా లేకపోవడంతో ఈసినిమా పై డివైడ్ టాక్ వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు. ఎదిఎమైనా ఈ టాక్ విషయంలో ఈ సాయంత్రానికి కాని పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: