టాలీవుడ్ బ‌బ్లీ బ్యూటీ నిత్యామీన‌న్‌కు ఓ యంగ్ హీరో ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఎప్పుడూ తెలుగు హీరోల‌ను ఆడుకునే నిత్యామీన‌న్‌కు ఈసారి ఓ టాలీవుడ్ హీరో స్ట్రాంగ్‌గానే మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే నిత్యామీన్ ప్రస్తుతం మాలిని 22 మూవీలో న‌టించింది. ఈ మూవీ త‌రువాతో టాలీవుడ్‌లో ఫాంలో ఉన్న ఓ యంగ్ హీరోతో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అయితే మొద‌ట‌గా ఆ హీరోతో న‌టించ‌టానికి నో చెప్పిన నిత్యామీన‌న్‌ను నిర్మాత‌లు ఎట్టకేల‌కు ఒప్పించారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా నిత్యామీన‌న్‌కు ఆ మూవీ డైరెక్టర్ క‌థ‌ను పూర్తిగా వివ‌రించ‌టానికి చెన్నై వెళ్ళాడు. స్టోరి మొత్తం విన్న త‌రువాత కొద్ది పాటి మార్పులు చెప్పి, అడ్వాన్స్‌ను తీసుకుంద‌ట‌. అయితే త‌రువాత మ‌రో వారం రోజుల‌కి డైరెక్టర్‌ను పిలుపించుకొని మ‌ళ్ళీ స్టోరీను వినిపించాల్సిందిగా కోరింది. ఎందుకు ఇలా అని అడిగిన డైరెక్టర్‌కు 'మీరు మొన్న చెప్పిన‌ప్పుడు నేను స‌రిగా విన‌లేదు, వ‌చ్చి మ‌ళ్ళీ విన‌పించండి' అంటూ చెప్పింద‌ట‌. అయితే డైరెక్టర్ ఈ సారి హీరోను వెంట బెట్టుకొని అక్కడ‌కు వెళ్ళాడు. హీరోను చూసిన నిత్యామీన‌న్ డైరెక్టర్‌తో చిర్రుబుర్రులాడింద‌ట‌. 'నేను మిమ్మల్ని ర‌మ్మన్నాను కాని, హీరోతో ర‌మ్మన్నానా? నాకు హీరోతో మాట్లాడాల్సిన‌ అవ‌స‌రం లేదు, క‌థ‌తోనే నాకు సంబంధం' అంటూ హీరో ఎదుట‌నే డైరెక్టర్‌పై సీరియ‌స్ అయ్యింద‌ట‌. దీంతో ఒళ్ళుమండిన హీరో అక్కడ నుండి వెనుదిరిగి, ప్రొడ్యూజ‌ర్‌తో హీరోయిన్‌ను క్యాన్సిల్ చేయ‌మ‌ని చెప్పాడు. ఇంకేముంది హీరో కోపానికి హీరోయిన్ మారిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న నిత్యామీన‌న్‌, హీరోకు సారి చేప్పటానికి ప్రయ‌త్నించిన‌ప్పటికీ ఆ ఛాన్స్‌ను నిత్యామీన‌న్‌కు ఇవ్వలేదంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: