! ఈరోజు తనకు అత్యంత ఇష్టమైన శ్రీవెంకటేశ్వరస్వామికి సంబంధించిన ముక్కోటి ఏకాదశి రోజున నందమూరి సింహం బాలయ్య నిమ్మకూరు వచ్చాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు ఏదోవిధంగా తెలుగుదేశ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన కుటుంబానికి మంచి పట్టు ఉన్న, కృష్ణ జిల్లా పై గత కొంత కాలంగా బాలయ్య అత్యంత శ్రద్ద కనపరుస్తున్నాడు. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు పుట్టిన నిమ్మకూరుకు చేరుకోవడంతో బాలయ్యను చూసేందుకు భారీగా అభిమానులు పరిసర ప్రాంతాల నుండి తరలి వచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నిమ్మకూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్య రాకతో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నిమ్మకూరులో ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభిచాడు బాలయ్య. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ పేరున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెపుతూ అతి త్వరలో తన అభిమానుల ఆధ్వర్యంలో ఎన్‌బికె సేవా సంస్థను ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సంస్థకు చైర్మన్‌గా తానే ఉంటానని బాలకృష్ణ చెప్పాడు. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘లెజెండ్’ సినిమాకు సంబంధించిన కటౌట్లు స్వాగత బేనర్ల మధ్య కోలాహలంగా నేడు బాలకృష్ణ కృష్ణ జిల్లా పర్యటన జరుగుతూ ఉండటం టాలీవుడ్ లో లేటెస్ట్ న్యూస్ గా మారడమే కాకుండా బాలకృష్ణ వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుగడలను మిగతా పార్టీల వారు సునిశితంగా పరిశీలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: