టాలీవుడ్ పై కాజల్ పెంచుకున్న కోపాన్ని తగ్గించు కున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు తెలుగు భాష పై తన ప్రేమను కూడా పెంచుకుని ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటోంది కాజల్. ఈ పరిస్థుతులు ఇలా ఉంటే అనుకోకుండా అటు బాబాయ్ పవన్ ఇటు అబ్బాయ్ చరణ్ తోను ఈ సంవత్సరం ఈమె రోమాన్స్ చేయడం ఖాయం ఖచ్చితంగా వినిపిస్తున్నాయ్. ప్రస్తుతo నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ త్వరలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళపోతున్న ‘గబ్బర్ సింగ్ -2’ సినిమాలో కాజల్ కు పవన్ ఓటు వేసాడట. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా హీరోయిన్ దొరకక పోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక లాభం లేదనుకుని అన్వేషణను ఆపు చేసి పవన్ కాజల్ కు ఒకే చేసాడు అని టాక్. గతంలోనే పవన్ కాజల్ వైపు చూసినా పారితోషికం విషయంలో కాజల్ కొండెక్కి కూర్చోవడంతో వెనక్కి తగ్గిన చిత్రయూనిట్ కొత్త అమ్మాయిని, అదీ అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయిని ఎంపిక చేయడానికి ఆడిషన్స్ కూడా నిర్వహించారు. కానీ పవన్ కు సరిజోడి దొరక్కపోవడంతో ఆ ప్రయత్నాన్ని వదులుకొని మళ్ళీ పాతవారినే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. కాజల్ కూడా తన పారితోషికాన్ని తగ్గించడంతో ఈ పని సులువు అయింది అని అంటున్నారు. అయితే ఫిలిం నగర్ వర్గాలు మాత్రం మెగా హీరోల సరసన నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొన్నటికి మొన్న క్రిష్ణ వంశీ రామ్ చరణ్ సినిమా కోసం కూడా మొదట్లో వేరే అమ్మాయిని తీసుకోవాలని చూసి ముంబాయ్ అంతా తిరిగి ఎక్కడా ఎవరు దొరకకపోవడంతో కాజల్ నే దిక్కుగా ఎంచుకున్నారు. ప్రస్తుతం పవన్ కూడా అదే రూట్ పట్టడంతో బాబాయ్ కి మరియు అబ్బాయ్ కి కూడ కాజలే దిక్కు అయింది అనే సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: