నిన్నటిదాకా మహేష్ అభిమానుల ఎదురు చూపు ముగిసింది. దాని ఫలితాలు కూడా బయటకు వచ్చాయి ఇక మెగా అభిమానుల ఎదురు చూపు ప్రారంభమైంది. వారు గత ఆరు నెలలు గా ఎదురు చూస్తున్న ఉదయం రేపు రాబోతోంది. మెగా అభిమానులు చిరంజీవిని దేవుడిలా ఆరాధించడానికి కారణం చిరు తన సినిమాలలో వేసిన స్టెప్పులే. తండ్రికి తగ్గ తనయుడిగా తన తొలి సినిమా ‘చిరుత’ నుండి డాన్సుల విషయంలో బాగా శ్రద్ద పడుతున్నాడు చరణ్. ‘మగధీర’, ‘రచ్చ’, ‘నాయక్‌’ సినిమాల విజయంలో చరణ్‌ చేసిన డాన్సుల పాత్ర చాల ఉంది.  ‘నాయక్‌’లోని ‘లైలా’ సాంగ్‌ డాన్స్ పరంగా చరణ్‌ని టాప్‌ రేంజ్‌లో నిలబెట్టింది. దీనితో తాను నటిస్తున్న ప్రతి సినిమాలోను డాన్స్ ల పరంగా తన ముద్ర ఉండేటట్లుగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు చరణ్‌, ‘ఎవడు’ సినిమా విషయంలో కూడా అలాగే ప్లాన్‌ చేసుకున్నాడు. ‘ఎవడు’ సినిమాలో ‘ఫ్రీడమ్‌..’ అంటూ సాగే పాట డాన్సుల్లో చరణ్‌ తన అభిమానులను విపరీతమైన జోష్ కు తీసుకు వెళతాడు అని అంటున్నారు. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాలో ‘ఫ్రీడమ్‌..  సాంగ్‌కి సంబంధించిన రెండో టీజర్‌ ‘ఫ్రీడమ్‌..’ అంటూ సాంగ్‌ బిట్‌ తో రూపొందించన టీజర్ ను చూసి మెగాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నిన్న విడుదలైన మహేష్ ‘వన్’ సినిమాకు బి సి సెంటర్లలో అంత సంతృప్తికరమైన టాక్ రాకపోవడంతో మాస్ ప్రేక్షకుల విషయంలో మంచి పట్టు ఉన్న చెర్రీ ఈ సంక్రాంతికి కలెక్షన్స్ సునామి సృస్టించిడం ఖాయం అని అంటున్నారు మెగా అభిమానులు. ‘ఎవడు’ సినిమాకు కూడా ‘వన్’ సినిమాలాగే డివైడ్ టాక్ వస్తే ఈసారి సంక్రాంతి పోటీ ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: