పవన్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘అత్తారింటికి దారేది’ రికార్డులను తిరగ రాసే సినిమాగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘1’ సినిమా రావడం నెగిటివ్ టాక్ రావడం అన్నీ జరిగిపోయాయి. సుకుమార్ ఈ సినిమాను రెండు సంవత్సరాలు చాల ఏకాగ్రతతో చెక్కాడు. కానీ ప్రేక్షకుల నుంచి ఆయనకు ఆశించిన స్పందన రాలేదు. ఆయన మేధస్సును ప్రేక్షకులు అందుకోలేకపోయారేమో అని అనిపిస్తోంది. దీనితో ఈ లెక్కల మాస్టారు రూటెటు, అంటూ అప్పుడే టాలీవుడ్ లో చర్చలు మొదలు అయ్యాయి. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ టాలీవుడ్‌లో చేస్తాడా లేక బాలీవుడ్‌ లో చేస్తాడా అనేదానిపై ఇండస్ట్రీ చర్చ మొదలైంది.‘వన్’ యాక్షన్ సినిమాగా చేశాడు డైరెక్టర్ సుకుమార్. ఎప్పుడూ స్టోరీని మెయిన్ హీరోగా చూపెట్టే సుకుమార్ ఈసారి పట్టు తప్పాడు. దానితో అసలు కథే లేదంటున్నారు ప్రేక్షకులు. ఈసినిమా రాకముందు సుకుమార్-జూనియర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో మూవీ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లబోతోందని జోరుగా ప్రచారం సాగింది. ‘వన్’కి నెగెటివ్ టాక్‌ రావడంతో జూనియర్ మూవీని పక్కనపెడతాడా, లేదంటే ధైర్యం చేసి సుకుమార్ తో కలిసి ప్రయాణిస్తాడా అనే విషయం పై రకరకాల ఊహాగానాలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. కుటుంబ తరహా సినిమాలు బాగా తీస్తాడనే పేరు సుకుమార్‌కు వుంది. కానీ ‘వన్’ సినిమాను అటు థ్రిల్లర్ గా కాకుండా ఫ్యామిలీ సినిమాగాను కాకుండా ఎందుకు ఇలా తీసాడు అంటూ మహేష్ అభిమానులుకు బుర్ర పిచ్చేక్కి పోతోంది. ఈ పరిస్థుతులలో జూనియర్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ‘ఆర్య 2’ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తాడా అనే విషయంపై రకరకాల ఊహాగనాలు వినపడుతున్నాయి. ఎదిఎమైనా సుకుమార్ మహేష్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: