మెగా అభిమానుల‌ను ఆ హీరో టార్గెట్ చేశాడు. ఆ హీరో ఆంటే ఎవ‌రో కాదు, అక్కినేని వంశపు వార‌సుడు నాగ‌చైత‌న్య, త‌న అభిమానుల‌నే కాకుండా మెగా అభిమానుల‌ను సైతం టార్గెట్ చేస్తున్నాడు. ఈ సారి ఆటోన‌గ‌ర్ సూర్య మూవీతో మెగా అభిమానులు కాస్త నాగ‌చైత‌న్యకు అభిమానులుగా మారిపోవ‌డం ఖాయం అని అంటున్నారు. ఇదంతా నాగ‌చైత‌న్య అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఆటోన‌గ‌ర్ సూర్య ప‌బ్లిసిటిలోని భాగంగా జ‌రుగుతుంది. ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సిన నాగ‌చైత‌న్య న‌టించిన ఆటోన‌గ‌ర్ సూర్య మూవీ ఎట్టకేల‌కు జ‌న‌వ‌రి 31వ తేధీన రిలీజ్ అవుతుంది. దీంతో మూవీ ప్రమోష‌న్‌కు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులోని భాగంగానే ఆటోన‌గ‌ర్ సూర్య ట్రైల‌ర్స్‌ను ధియోట‌ర్స్‌లోనూ ప‌బ్లిసిటి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జ‌న‌వ‌రి 12న మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఎవ‌డు మూవీ రిలీజ్ అవుతుండ‌టంతో, ఈ మూవీ ప్రద‌ర్శించ‌బ‌డుతున్న ధియోట‌ర్స్‌లో ఆటోన‌గ‌ర్ సూర్య ట్రైల‌ర్స్‌ను ప్లే చేస్తున్నారు. దీంతో నాగ‌చైత‌న్య మూవీకు విప‌రీత‌మైన ప‌బ్లిసిటి ఏర్పడ‌ట‌మే కాకుండా మెగా అభిమానుల‌ను ఎట్రాక్ట్ చేసిన‌ట్టు అవుతుంద‌ని టాలీవుడ్ అంటుంది. ఈ సినిమా ఆడియో ఈ నెల 19న మన ముందుకు వస్తుంది. ఈ వేడుకకు వేదిక 'శిల్పకళా వేదిక' అయ్యింది. మొత్తానికి నాగ‌చైత‌న్య ప‌బ్లిసిటి ప్లానింగ్ సూప‌ర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: