ఎంతటి టాప్ సక్సస్ ఫుల్ హీరో అయినా సెంటిమెంట్ ముందు తలవంచక తప్పదు. బాలీవుడ్ ను ప్రభావంతో టాలీవుడ్ లో కూడా సీక్వెల్ సినిమాల క్రేజ్ నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న మెగా కుటుంబానికి సీక్వెల్ సెంటిమెంట్ అచ్చిరాలేదు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం గతంలో మెగా హీరోల నుంచి వచ్చిన సీక్వెల్స్‌ ఆశించిన స్థాయి విజయాల్ని సాధించకపోవడమే అని అంటారు. http://cinetara.com/ గతంలో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన రీమేక్‌ సినిమా ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్’, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత అదే సినిమాకి సీక్వెల్‌గా తీసిన ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. మెగాస్టార్‌ చిరంజీవి ఛరిష్మా ఈ సినిమాని ఏమాత్రం కాపాడలేకపోయింది. అలాగే బన్ని కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఆర్య’ పెద్ద విజయంసాధించింది. దర్శకుడు సుకుమార్ కు ఈ సినిమా విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది  అయితే అదే కాంబినేషన్‌లో వచ్చిన సీక్వెల్‌ ‘ఆర్య2’ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచింది. ఈ రెండు సినిమాల ప్రభావం ప్రస్తుతం మెగా కుటుంబం పై చాల ఉంది అని అంటారు. అందుకే సీక్వెల్ పేరు చెపితే మెగా కుటుంబం పెద్ద ఆశక్తి చూపారు అని టాక్ కూడ ఉంది. ఈ విషయం పవన్ పై ప్రభావం చుపెడుతోంది అనే వార్తలు వినపడుతున్నాయి. ‘గబ్బర్‌సింగ్‌’ తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న పవన్‌కి ఇప్పుడు ‘గబ్బర్ సింగ్-2’ తీస్తున్న విషయంలో ఇదే సెంటిమెంట్ పీడలలా వెంతుతూ ఉండడంతో పవన్ తన సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ తో సహా, అన్ని విభాగాల్లోనూ పవన్‌ ఆచి తూచి అడుగులేస్తున్నాడ ని సన్నిహిత వర్గాలు అంటున్నాయి  అందువలనే పవన్ ‘గబ్బర్ సింగ్2’ సెట్స్ పైకి రావడానికి ఆలస్యం జరుగుతోందని అంతేకాని పవన్ లేటెస్ట్ మ్యారేజ్ కాని, హీరోయిన్ సమస్య కాని కారణం కాదు అంటు పవన్ సన్నిహిత వర్గాల టాక్.   

మరింత సమాచారం తెలుసుకోండి: