సినిమా తీసేది డైరక్టర్ పనితనం చూపించుకోవడం కోసం... హీరో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం... ఇంకా అందరు వారి వారి ఎక్స్ ట్రీం లెవెల్ లో వారి టాలెంట్ ని బయట పెట్టడమే.. కానీ ఆడియెన్స్ ఆలోచన తీరు మాత్రం ఎప్పటికి మారేట్టు లేదు.. కోట్లకి కోట్లు కర్చుపెట్టి సినిమా తీస్తే కేవలం ఒక్క మాటతో ఆ సినిమా ని అధ పాతానికి తొక్కేస్తున్నారు.. వారు ఎప్పటికీ సినిమా అంటే ఒక ఎంటర్ టైన్మెంట్ అని మాత్రమే ఆలోచిస్తున్నారు.. సినిమా అంటే అది కాదు ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎంతో సమాచారం తెలుసుకోవడం అని ఎప్పటికి తెలుసుకుంటారో. అది కాకుండా మూసాలో వచ్చిన ఫార్ములానే ఎంకరేజ్ చేస్తారు. ఎవడైనా ప్రయోగాలు చేస్తే ఆడియెన్స్ కి నచ్చితుందా లేదా అని బయటికి మంచి టాక్ వచ్చేదాకా చచ్చి బ్రతుకుతున్నారు దర్శక నిర్మాతలు. డియర్ డైరక్టర్స్ మీరు ఎంతో శ్రమపేర్చు చెమటోద్చి ఎవేవో ప్రయోగాలు చేసి సినిమాలు చేస్తుంటారు అవన్నీ మాకు అనవసరం జస్ట్ బ్రహ్మానందం ని పెట్టి కొన్ని వెకిలి కామెడీ సీన్స్ పెట్టండి చాలు... కథ ల గురించి మీరు ఎక్కడికో వెళ్లకండి ఓ పెద్దింటి అమ్మాయి ఓ పేదింటి అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అమ్మాయి అబ్బయి ఎలా వారి ప్రేమని గెలిచారు.. అదే కథ చాలు దీన్నే మళ్లీ మళ్లీ తీయండి మేము చూస్తాం కానీ ప్రయోగాలు చేయకండి. ఒక ఫైట్ .. ఒక డ్యూయట్ .. ఒకీ ఐటం సాంగ్ చాలు ఇంతకు మించి ఏమీ వద్దు... మేము ఆలోచించే వాటిలోనే కొత్త వాటిని చూపించడి అంతేకానీ మా ఆలోచనకి అంతుపట్టని ఐడియాలను మా మీదకు వదలకండి అని భావిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారన్నది కరెక్టే ఆడియెన్స్ ఆలోచనలు మారనంత వరకు మనం ఎంత ప్రయత్నించినా .. ఎన్ని ప్రయోగాలు చేసినా వారికి అర్దం కావు.. జస్ట్ వారికి కావాల్సింది ఎంటర్ టైన్మెంట్ మాత్రమే.. ఏం చేస్తాం. అది దర్శక నిర్మాతల దురదృష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: