దాదాపు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి సినిమాలు తీస్తుంటే ఆ సినిమా ని పైరసీ ని చేసి అమ్ముతున్నారు కొందరు పైరసీ మాఫియా ముఠాలు. సినీ ఇండస్ట్రీ ఎన్నో ఏళ్లుగా పైరసీ మీద పోరాటం చేస్తూనే ఉంది. అయినా దాని అంతు చూడటం అవ్వట్లేదు. ఈ పైరసీని రూపుమాపే చర్యలే లేవా అంటే ఉన్నాయి కానీ దానికి అన్ని వర్గాల నుండి సపోర్ట్ కావాలి ముఖ్యంగా ఆడియెన్స్ దగ్గర నుండి..ఫ్యామిలీ మొత్తం 15 రూపాయలకే సినిమా చూడొచ్చు అనే ఆలోచనతో పైరసీని ఎంకరేజ్ చేస్తారు ప్రేక్షకులు. సంక్రాంతికి పోటా పోటీగా రిలీజ్ అయిన 1,ఎవడు సినిమాలు అటు నువ్వా నేనా అని కలెక్షన్స్ లో తమ తమ స్టామినాను నిరూపించుకుంటుంటే ఇదే అధునుగా ఆ సినిమాల పైరసీ సీడిలను అమ్ముతున్నారు పైరసీ ముఠాదారులు.. అసలకే 1 సినిమా అటుఇటుగా టాక్ సంపాధించి కలెక్షన్స్ ని రాబట్టుకుంటుంటే ఈ పైరసి ఇంకా సినిమాను పాతాలానికి తొక్కేస్తుంది. ఇక ఎవడు సినిమా కూడా పర్లేదనిపించుకునే టాక్ తో కలెక్షన్స్ ని మంచిగానే రాబట్టుకుంటుంది. కానీ ఎవడు ని కూడా పైరేట్ చేసారట పైరసీ దారులు. సంక్రాతికి రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు పైరేట్ అవ్వడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు వాటిపై చర్యలు తీసుకునేనుందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఎంటో కష్టపడి శ్రమించి మనల్ని ఎంటర్ టైన్ చేయడానికి సినిమా వాళ్లు అంత కష్ట పడ్తుంటే వారి కష్టాన్ని ఇలా పైరేటెడ్ సీడిలను చూసి విలువ లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. థియేటర్ లో మంచి ఆడియో క్వాలిటీతో సినిమా చూస్తే ఆ అనుభూతే అద్భుతంగా ఉంటుంది.. సో ఆడియెన్స్ హీరోలను అభిమానించడామేకాదు వారి సినిమాలు పైరసీ భారిన పడకుండా చూసే భాద్యత కూడా అభిమానులకే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: