యువరత్న బాలకృష్ణ సింహా బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూవీ లెజెండ్.. దమ్ము తో కాస్త నిరాశపరచిన బోయపాటి ఈ సినిమాతో మరోసారి తనేమిటో ప్రూవ్ చేయబోతున్నాడు. సింహా సినిమాలో బాలయ్యని డిఫరెంట్ గెటప్ లో చూపించి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు సూపర్ హిట్ ఇచ్చిన ఈ డైరక్టర్ లెజెండ్ సినిమాను చాలా కేర్ ఫుల్ గా తీస్తున్నాడట.. 14 రీల్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాను గోపి ఆచంట, రాం ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు..దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ టైం బాల కృష్ణ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు. క్రేజీ కాంబినేషన్ గా వస్తున్న ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. జనవరి 1 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఈ నెల చివరన మొదటి ట్రైలర్ ని రిలీజ్ చేస్తారట. ఫిబ్రవరి మొదటి వారం ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక పోతే సినిమాను మాత్రం మార్చ్ 28 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరోసారి సింహా కాంబినేషన్ తో వస్తున్న ఈ సినిమా ఆ సినిమా కంటే పెద్ద హిట్ అవ్వాలని.. ఈ సినిమా దర్శకుడు బోయపాటికి ఓ సూపర్ హిట్ సినిమా అవ్వాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: