స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రియ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు ఆడపిల్ల పుట్టినట్లు నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నిన్న సంక్రాంతి రోజున బుధవారం ఉదయం స్నేహారెడ్డి ప్రసవించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ వార్త ఫై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఆమెకు ఆమె ఫిబ్రవరి లో ప్రసవించే అవకాశం ఉంది అంటు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందుగానే సంక్రాంతి పర్వదినాన అల్లు వారి ఇంట మహాలక్ష్మి పుట్టడం గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు.  అసలు అర్జున్-స్నేహారెడ్డీలు మొదట్లో స్నేహితులు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన తరువాత అల్లు వారి కుటుంబంలో ఇదే శుభవార్త.  అల్లు అర్జున్ జీవితంలోకి వచ్చిన ఈ సంక్రాంతి లక్ష్మి అల్లుఅర్జున్ రాబోతున్న సినిమా ‘రేసుగుర్రం’ కు ఎటువంటి అదృష్టాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: